Leading News Portal in Telugu

LBnagar PS Incident: ఢిల్లీకి చేరిన ఎల్బీనగర్ పీఎస్లో మహిళపై దాడి ఘటన


ఆగస్టు 15 రాత్రి 11 గంటలకు ఎల్బీనగర్‌ చౌరస్తాలో పోలీసులకు ముగ్గురు మహిళలు కనిపించారు. స్థానికంగా ఇబ్బంది కలిగిస్తున్నారంటూ వారిని పీఎస్ కు తరలించారు. సెక్షన్‌ 290 కింద కేసు నమోదు చేశారు. తమను ఎందుకు తీసుకొచ్చారని మీర్‌పేటకు చెందిన మహిళ ప్రశ్నించగా.. విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు శివశంకర్‌, సుమలత ఆ మహిళను లాఠీలతో దారుణంగా కొట్టారు. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ లో చోటు చేసుకోగా.. ఇప్పుడు విషయం ఢిల్లీకి చేరింది. ఎల్బీనగర్ పీఎస్ లో మహిళపై దాడి ఘటనపై బాధితుల తరపు కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల నాయకులు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీతో పాటు రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు.

Kantara – 2: వామ్మో.. అంత బడ్జెటా..రిషబ్ అందుకే ఇలా చేస్తున్నాడా?

ఈ ఘటనపై మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. హైకోర్టు సుమోటాగా కేసు విచారణకు తీసుకుందని ధన్యవాదాలు తెలిపారు. ప్రజలను కాపాడేందుకు ఏ ‘షీ’ టీమ్ లేదని ఆరోపించారు. ఎల్బీనగర్ డీసీపీ ఆఫీస్ లో ఆరోజు ఉన్న పోలీసులందరిని డిస్మస్ చేయాలని ఆయన కోరారు. తూతూమంత్రంగా పోలీసులను సస్పెండ్ చేసి కేసీఆర్ చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. గిరిజనులపై జరిగే హత్యాచారాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్ అంటే బ్రష్టు పట్టిన సర్కార్ అని మండిపడ్డారు.

Venu Swamy: అల్లు అర్జున్ జాతకం.. ఇకముందు జరగబోయేది అదే.. ?

గిరిజన మహిళ పై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఇప్పటి వరకు కవిత స్పందించలేదని రవీంద్ర నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ పిట్ట ఎక్కడ ఉంది. 33 శాతం రిజర్వేషన్ అడిగిన కవిత ఎక్కడా అని కామెంట్ చేశారు. కూతురు పై కేసులు పెడితే కేసీఆర్ కోట్లు ఖర్చు చేసి న్యాయవాదిని పెట్టుకుంటారు.. కానీ గిరిజన మహిళ పై దాడి జరిగితే స్పందించరా రవీంద్ర నాయక్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.