Cheetah in LB Nagar: చిరుతలు ఎక్కడో అడవుల్లో ఉన్నారని అనుకుంటారు కానీ.. ఇప్పుడు ఆ చిరుతలు పట్నంలో దర్శనమిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరించినట్లు తెలుస్తోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వనస్థలిపురంలోని సాగర్ కాంప్లెక్స్ రోడ్ నెం.6లో గురువారం అర్ధరాత్రి చిరుత సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఓ ఇంటి ఆవరణలో మధ్యాహ్నం 12:30 గంటలకు చిరుతపులి సంచరించిందని యజమాని అఖిల్ తెలిపారు. వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించగా.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లారు. అయితే పోలీసులు వచ్చేలోపే చిరుత ఏరోనాటికల్ కంపెనీ గోడ దూకి అడవిలోకి పారిపోయిందని అఖిల్ వివరించాడు. వెంటనే అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. చిరుత పాదాలను పరిశీలించారు. చిరుత అడవిలోకి వెళ్లిందని అనుమానిస్తున్నారు. సాధారణంగా చిరుతపులి 24 గంటల్లో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని అటవీశాఖ అధికారులు తెలిపారు.
Read also: AP-Telangana: వాతావరణంలో మార్పు.. ఏపీ, తెలంగాణలో తేలికపాటి వర్షాలు
ఈ లెక్కన చిరుతపులి ఇబ్రహీంపట్నం అడవుల్లోకి వెళ్లిందని భావిస్తున్నారు. ఇబ్రహీంపట్నం అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతపులి కదలికలను గుర్తించేందుకు పలుచోట్ల కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. చిరుత సంచారంతో ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత ఎటువైపు నుంచి వస్తుందోనని భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు వెంటనే చిరుతను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అటవీ శాఖ అధికారుల బృందం మరోసారి ఈ ప్రాంతాన్ని సందర్శించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్థానికులు పోలీసులకు, అటవీ అధికారులకు సమాచారం అందించినా ఫలితం లేకపోయిందని అధికారులు తెలిపారు. ‘ఆ చిరుతపులి ఒక్కటి తప్ప మరెవరూ చూడలేదు. అయితే ఆ స్థలంలో రెండు బోనులను ఉంచి తగు జాగ్రత్తలు తీసుకున్నాం’ అని అటవీ రేంజ్ అధికారి తెలిపారు. ఏవియేషన్ అకాడమీ ప్రవేశం, నిష్క్రమణ వద్ద బోనులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొన్నేళ్ల క్రితం ఎల్బీ నగర్ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందని, ఆటోనగర్‌లోని డంప్‌యార్డులో కుక్కలను వేటాడినట్లు అటవీశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఎట్టకేలకు దాన్ని పట్టుకుని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో విడిచిపెట్టినట్లు సమాచారం.
AP-Telangana: వాతావరణంలో మార్పు.. ఏపీ, తెలంగాణలో తేలికపాటి వర్షాలు