అబ్దుల్లాపూర్ మేట్ బ్రిల్లియంట్ ఇంజినీరింగ్ కాలేజ్ లో విద్యార్థి మిస్సింగ్ కలకలం రేపుతుంది. డిప్లొమా సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఆంజనేయులు గత ఆరు రోజులుగా కనిపించడం లేదంటూ తొటి విద్యార్థులు, స్టూడెంట్ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆంజనేయులు మిస్సింగ్ కి కాలేజ్ యాజమాన్యమే కారణం అంటూ స్టూడెంట్స్, విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగాయి. కాలేజ్ లోపలికి చొచ్చుకెల్లి కొందరు విద్యార్థులు అద్దాలు ధ్వంసం చేశారు. హాస్టల్ క్యాంపస్ లో సీసీ కెమెరాలు ఎక్కడా పనిచేయలేదు.
ఆంజనేయులు తప్పిపోయి 6 రోజులు అవుతున్నా.. పేరెంట్స్ కి సమాచారం చేయని కాలేజ్ యాజమాన్యం.. 6 రోజులుగా తమ కొడుకు ఫోన్ చేయడం లేదని.. తొటి విద్యార్థులకు ఫోన్ చేసిన పేరెంట్స్.. మీ అబ్బాయి మిస్ అయ్యాడు అని చెప్పిన ఆంజనేయులు ఫ్రెండ్స్.. దీంతో కంగారుగా కాలేజ్ కి చేరుకున్న పేరెంట్స్, బంధువులు.. కాలేజ్ ఎదుట ఆందోళన చేశారు. కాలేజ్ యాజమాన్యం, వార్డెన్ పొంతన లేని సమాధానాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో కాలేజ్ కి సెలవు ప్రకటించి యాజమాన్యం వెళ్లిపోయింది. దీంతో కాలేజ్ దగ్గర ఆంజనేయులు తల్లి మాట్లాడుతూ.. మాకు నిత్యం ఫోన్ చేసే మా అబ్బాయి.. మూడు రోజులుగా ఫోన్ చేయకపోవడంతో భయపడ్డాం.. కాల్ చేస్తే ఫోన్ పనిచేయలేదు.. ఫ్రెండ్స్ కి ఫోన్ చేశాం.. మీ అబ్బాయి తప్పిపోయాడు.. మేమంతా వెతుకుతున్నాం.. మీకు ఇంకా తెలియదా అన్నారు.. మేము కాలేజ్ కి వచ్చి అడిగితే.. నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ తప్పించుకున్నారు.. పోలీసులకు ఫిర్యాదు చేశాం.. సీఐ కాల్ చేస్తే కానీ వార్డెన్ కాలేజ్ కి రాలేదు అని ఆమె పేర్కొన్నారు.
కాలేజీలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదు అని ఆంజనేయులు తల్లి అన్నారు. యాజమాన్యం పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు.. మా అబ్బాయి మాకు క్షేమంగా దొరికితే చాలు.. ఈ కాలేజ్ వద్దు.. వీడి బిల్డింగులు వద్దు.. అప్పు చేసి.. మా జీవితం తాకట్టు పెట్టి మా పిల్లాడిని ఈ కాలేజ్ లో చేర్పించాం.. మూడు రోజులుగా బయట బస్టాండ్ లో పడుకుంటున్నాం.. మా పిల్లాడు రాకపోడా అని హాస్టల్ వద్ద వచ్చి ఎదురు చూస్తున్నాం.. మా పిల్లాడికి ఏం జరిగినా కాలేజ్ యాజమాన్యం దే బాధ్యత అని ఆంజనేయులు కుటుంబ సభ్యులు హెచ్చరించారు.