నేను ఆ బాధితురాలినే: అను ఇమ్మానుయేల్
కాస్టింగ్ కౌచ్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. ఏ ఫీల్డ్ అయినా ప్రతిచోట అమ్మాయిలకు ఈ వేధింపులు తప్పడం లేదు. అయితే ఈ పదం సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఈ మధ్య మీ టూ అంటూ కాస్టింగ్ కౌచ్ కు గురైన చాలా మంది బయటకు వచ్చి తమ బాధను పంచుకున్నారు. అప్పట్లో బయటకు వచ్చిన కొంతమంది సినీ ప్రముఖుల పేర్లు సంచలనం సృష్టించాయి. ఈ కాస్టింగ్ కౌచ్ ఎదుర్కున్నామంటూ ఏదో చిన్న చిన్న ఆర్టిస్టులే కాకుండా పెద్ద పెద్ద హీరోయిన్ లు కూడా కొన్ని సందర్భాల్లో తెలిపారు. ఇక ఇలాంటి వాటిని తాము ఎలా ఎదుర్కొన్నామో కూడా తెలిపారు. ఇక కొంత మంది ఇవి చాలా కామన్ అంటూ కొట్టిపడేశారు కూడా. తాజా హీరోయిన్ అను ఇమ్మానుయేల్ కూడా తానూ కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని వెల్లడించింది.
చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది అను ఇమ్మానుయేల్. తరువాత ఈ మలయాళ బ్యూటీ నిఫిన్ బాలికి జంటగా యాక్షన్ హీరో బిజూ అనే మలయాళ చిత్రం 2016 లో నటించి హీరోయిన్ గా పరిచయమయ్యింది. ఇక అదే ఏడాది ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నాని హీరోగా చేసిన మజ్ను తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఇక ఆ తరువాత మరో కోలివుడ్ సినిమాలో శివకార్తికేయన్ కు జంటగా నటించింది. వీరు జంటగా నటించిన ‘నమ్మవీట్టు పిళ్లై’ మంచి టాక్ తెచ్చుకుంది.
అన్నీ సాధించిన నీరజ్ చోప్రా!
భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సరికొత్త చరిత్రను లిఖించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరిగిన అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో నీరజ్ 88.17 మీటర్ల దూరం జావెలిన్ విసిరి ఈ చారిత్రాత్మక ఫీట్ సాధించాడు. పాకిస్థాన్ త్రోయర్ అర్షద్ నదీమ్ (87.82) రజతం నెగ్గగా.. చెక్‌కు చెందిన వద్లెచ్ (86.67) కాంస్యం సొంతం చేసుకున్నాడు.
నీరజ్ చోప్రా గెలిచిన స్వర్ణంతో మొత్తంగా ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్‌కు లభించిన మూడో పతకం మాత్రమే. ఇంతకుముందు 18 ఛాంపియన్‌షిప్స్‌లో భారత దేశానికి రెండే పతకాలు వచ్చాయి. 2005లో మహిళల లాంగ్‌జంప్‌లో అంజు బాబి జార్జ్ కాంస్యం సాధించారు. చాలా ఏళ్ల తర్వాత 2022లో ఛాంపియన్‌షిప్స్‌లో నీరజ్ రజతం గెలుచుకున్నాడు. 2023 ఛాంపియన్‌షిప్స్‌లో నీరజ్ పసిడి గెలిచాడు. మూడు పతకాలలో నీరజ్ సాధించినవే రెండు ఉన్నాయి.
చరిత్ర సృష్టించిన భారత్.. పసిడి పతకం సాధించిన నీరజ్ చోప్రా
ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న భారత్ కల నెరవేరింది. ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ఘనతను జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సాధించాడు. అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ జెండా రెపరెపలాడింది. ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా సత్తాచాటాడు.హంగేరీలోని బుడాపెస్ట్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చరిత్రను తిరగరాశాడు. స్వర్ణ పతకం గెలిచాడు. గోల్డ్ మెడల్ సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. జావెలిన్ త్రో ఫైనల్‌లో జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరాడు నీరజ్. ఫైనల్స్ తొలి ప్రయత్నంలో విఫలమైనా రెండో మారు జావెలిన్‌ను 88.17 మీటర్లు విసిరాడు. ఆ తరువాత వరుసగా 86.32, 84.64, 87.73, 83.98, మీటర్ల దూరానికి విసిరాడు.
ఇక పాకిస్తాన్ కు చెందిన అర్షద్ నదీమ్ జావెలిన్ ను 87.82 మీటర్లు విసిరాడు. ఇక చెక్ రిపబ్లిక్ కు చెందిన జాకబ్ వడ్ లెజ్క్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని దక్కించుకున్నారు. జాకబ్ వడ్ లెజ్క్ ఈటెను 86.67 మీటర్లు విసిరి బ్రాంజ్ మెడల్ సాధించాడు. ఇక నీరజ్ చోప్రాతో పాటు ఇండియా నుంచి మరో ఇద్దరు ప్లేయర్ లు కూడా ఈ పథకం కోసం పోటీ పడ్డారు. వారిలో ఒకరైన కిషోర్ జెనా 84.77 మీటర్లతో ఐదో స్థానానికి పరిమితం అయ్యాడు.
మహిళలకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతుందంటే?
పసిడి ప్రియులకు ఊరట. వరుసగా పెరిగిన బంగారం ధరలు గత మూడు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో సోమవారం (ఆగష్టు 28) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,450గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఏ మార్పు లేదు. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి తెలుసుకుందాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,600గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,800లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,780 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,450గా కొనసాగుతోంది.
ఇంగ్లీష్ టీచర్ మోమోస్.. వీటి ప్రత్యేకత అదే!
సోషల్ మీడియా వచ్చాక ఫుడ్ కు సంబంధించిన చాలా వీడియోలు ఫేమస్ అవుతున్నాయి. ఇక ఎవరైనా రుచికరమైన, ఆరోగ్యకరమైన స్ట్రీట్ ఫుడ్ అందిస్తుంటే వాటిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు నెటిజన్లు. తమ ఫ్రెండ్స్ ను, బంధువులను తినమని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కల్తీలు ఎక్కువయిపోయాయి. పాల నుంచి నూనెలు, పప్పులు, ఉప్పులు.. ఇలా ఏది చూసినా ప్రతి ఒక్కటి కల్తీనే. డబ్బులు ఎక్కువ తీసుకుంటున్నా దానికి తగినట్లుగా ఎక్కడా హైజీన్ ఫుడ్ దొరకడం లేదు. అందుకే స్ట్రీట్ ఫుడ్ పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా లభిస్తే వెంటనే ఖాళీ చేసేస్తున్నారు జనాలు. ఇక పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మోమోస్ ను అందిస్తానంటూ ఓ ఇంగ్లీష్ టీచర్ మోమోస్ సెంటర్ ను స్టాట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నేడు ఎన్టీఆర్ శతజయంతి స్మారక నాణెం విడుదల.. 200 మంది అతిథులు! జూనియర్ వెళ్తారా?
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పేరిట రూ. 100 వెండి నాణేన్ని కేంద్ర ప్రభుత్వం ముద్రించిన విషయం తెలిసిందే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గౌరవార్థం శత జయంతిని పురస్కరించుకుని మోదీ సర్కార్ ఈ నాణేన్ని ముద్రించింది. ఈ స్మారక నాణేన్ని నేడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేయనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఈ కార్యక్రమం ఆరంభం కానుంది.
నాణెం విడుదల కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు. అంతేకాదు సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌తో కలిసి పనిచేసిన సన్నిహితులు చాలా మంది హాజరవుతారు. దాదాపుగా 200 మంది అతిథులు హాజరుకానున్నారు.
నేడు జగనన్న విద్యాదీవెన నిధులు జమ చేయనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నగరిలో జగనన్న విద్యా దీవెన కార్యక్రమం కింద ఆర్థిక సహాయాన్ని విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి రూ.680.44 కోట్లు కేటాయించింది, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.32 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చింది. ఈ మొత్తాన్ని 8,44,336 మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. ప్రతి త్రైమాసికం పూర్తయిన వెంటనే త్రైమాసిక ప్రాతిపదికన వారి మొత్తం ఫీజులను రీయింబర్స్ చేయడం ద్వారా నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకాన్ని రూపొందించింది.ITI, పాలిటెక్నిక్, డిగ్రీ కోర్సులు, ఇంజనీరింగ్, మెడిసిన్, ఇతర వృత్తిపరమైన కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులందరూ ఈ ప్రయోజనానికి అర్హులు. ముఖ్యంగా, జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అందించే ఆర్థిక సహాయంతో కుటుంబంలోని ఎంతమంది పిల్లలైనా ఉన్నత విద్యను అభ్యసించవచ్చు.