మళ్లీ వర్షాలు.. ఆ రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్..
మొన్నటివరకు భారీ వర్షాలు కురిసాయి.. దీంతో జనాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనం చూస్తూనే ఉన్నాం.. ఇప్పటికి పలు ప్రాంతాల్లో నీళ్లు కనిపిస్తున్నాయి.. ఈ మధ్య కాస్త వర్షాల నుంచి పీల్చుకున్న జనాలకు ఇప్పుడు మరో బాంబ్ ను పేల్చింది వాతావరణ శాఖ.. మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.. ఇదే సమయంలో పలు చోట్ల సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఆగస్టు 31 వరకు పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది..
ఈ నెల 31 న వరకు భారతదేశంలోని ఈశాన్య, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ గత ఆదివారం అంచనా వేసింది. ఆగస్టు 28 నుంచి 31 వరకు అస్సాం, మేఘాలయలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, మిజోరం, అండమాన్ నికోబార్ దీవుల్లో ఆగస్టు 28 నుంచి 31 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది..
సామాన్యులకు షాక్.. వర్షాలు తగ్గడంతో పెరగనున్న పప్పులు, నూనె గింజల ధరలు
ఆగస్టులో రుతుపవనాలు బలహీన పడ్డాయి. దీంతో రాబోయే కాలంలో కొన్ని ఇబ్బందులకు ఇది దారి తీయవచ్చు. వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా ప్రకారం గత 8 ఏళ్లలో ఈ ఏడాది ఆగస్టులో అత్యల్ప వర్షపాతం నమోదైంది. బలహీన రుతుపవనాల ట్రెండ్ సెప్టెంబర్‌లో కూడా కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీని వెనుక ఎల్‌నినో కారణం అని చెబుతున్నారు. తక్కువ వర్షం కారణంగా పప్పులు, నూనె గింజల ధరలు పెరగవచ్చు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఖరీఫ్ పంటల నాట్లు దాదాపు పూర్తయినప్పటికీ, రుతుపవనాలు బలహీనంగా ఉండటం వల్ల పంట దిగుబడి దెబ్బతినే అవకాశం ఉంది.
పప్పుధాన్యాలు, నూనె గింజలు విత్తిన తరువాత ఇప్పుడు ఈ పంట పుష్పించే దశలో ఉంది. వాటికి ఎక్కువ నీరు అవసరం. బలహీనమైన రుతుపవనాలు ఈ పంటల దిగుబడిపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతాయి. వాతావరణ శాఖ ప్రకారం సోమవారం వరకు భారతదేశంలో రుతుపవనాల లాగ్ పీరియడ్ సగటు 92 శాతం ఉంది. దేశంలోని వాయువ్య ప్రాంతంలో మాత్రమే గతేడాది కంటే 6 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. మరోవైపు మధ్య భాగంలో 7 శాతం, తూర్పు ఉత్తర భారతదేశంలో 15 శాతం, దక్షిణ ప్రాంతంలో 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.
మంచిర్యాలలో దారుణం.. పొట్టలో దూదిపెట్టి కుట్లు వేసిన డాక్టర్లు
మంచిర్యాలలోని ప్రభుత్వం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఉద్రిక్తతకు దారి తీసింది. లయా అనే గర్భిణి పురుటి నొప్పులతో ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో దూదిను మరిచిపోయారు. ఇంటికి వెళ్లిన లయా మూత్ర విసర్జన చేయడం, కడుపులో నొప్పి రావడంతో అస్వస్థతకు గురై, మరో ఆస్పత్రికి వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఐదు రోజుల క్రితం వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన కీర్తి లయకు కడుపునొప్పి రావడంతో.. కుటుంబ సభ్యులు ఆమెను మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఆమెకు సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగింది. ఆపరేషన్ సక్సెస్ అయింది.. కీర్తి లయ పండంటి పాపకు జన్మనిచ్చింది. అయితే ఆపరేషన్ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె కడుపులో దూదిని వదిలేసి కుట్లు వేశారు. దీంతో కీర్తి లయ తీవ్ర అస్వస్థతకు గురైంది. సోమవారం రాత్రి ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు చెన్నూరు ఆస్పత్రికి తరలించారు.
బుర్జ్ ఖలీఫా సాక్షిగా జవాన్ ట్రైలర్…
ఫేస్ ఆఫ్ బాలీవుడ్ గా పేరు తెచ్చుకున్న కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్… గత కొంతకాలంగా బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు. ఈ ఫేజ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ, అయిదేళ్ల తర్వాత పఠాన్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన షారుఖ్ ఖాన్ ఏకంగా 1000 కోట్లు వసూల్ చేసి కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చాడు. జనవరిలో పఠాన్ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన షారుఖ్ మరో వారంలో జవాన్ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ పునాదులని కదిలించడానికి సిద్ధమయ్యాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారి అంచనాలు ఉన్నాయి. టీజర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన జవాన్ నుంచి ఆ తర్వాత బయటకి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సాంగ్స్, పోస్టర్స్ అన్నీ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యి జవాన్ సినిమాపై రోజు రోజుకీ క్రేజ్ ని పెంచాయి. ఇప్పటికే జవాన్ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతూ ఉన్నాయి.
బెంగళూరు లోని బస్ డిపో ను సందర్శించిన తలైవా..
ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా అదిరిపోయే విజయం సాధించింది. అప్పటివరకు ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రజనీకాంత్ జైలర్ సినిమా తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. తలైవా ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా కాలర్ ఎగరేస్తున్నారు.ఇంతటి ఘన విజయం సాధించిన జైలర్ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కు మ్యూజిక్ మెయిన్ హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ ప్రతి సినిమా విడుదలకు ముందు హిమాలయ యాత్ర కు వెళ్తూ ఉంటారు. గత నాలుగేళ్లగా కరోనా కారణంగా హిమాలయ యాత్ర కు వెళ్లడం కుదరలేదు. దీనితో జైలర్ సినిమా విడుదలకు ముందు రోజు తలైవా హిమాలయాలకు వెళ్లారు. ఇటీవల హిమాలయ యాత్రను ముగించుకున్నారు.
నేను చేసిన తప్పేంటి..? బేతి సుభాష్ రెడ్డి ఆవేదన..!
నన్ను కోసి పడేశారు…నేను చేసిన తప్పు ఎంటి ? ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డీ ఆవదేన వ్యక్తం చేశారు. 2001 నుంచి తాను బీఆర్ ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పారు. పార్టీ అప్పగించిన బాధ్యతను నిర్వర్తించానని చెప్పారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి ఉప్పల్‌లో పార్టీని కాపాడుకున్నామని తెలిపారు. బండారి లక్ష్మారెడ్డి పార్టీ జెండా ఎత్తారా? అని అడిగారు. బండారి లక్ష్మారెడ్డికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. లక్ష్మారెడ్డి ట్రస్టు పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారని సుభాష్ రెడ్డి విమర్శించారు. తాను, బొంతు రామ్మోహన్ ఉద్యమకారులమని ఆయన అన్నారు. టికెట్ ఖరారు చేసే ముందు కనీసం తనతో చర్చించలేదన్నారు. నన్ను కోసి పడేశారు…నేను చేసిన తప్పు ఎంటి ? అని ప్రశ్నించారు. మేకను బలిచ్చే ముందు కూడా దానికి నీళ్లు తాగిస్తారని అన్నారు.
పిండి దొంగతనం.. బాలుడికి చిత్రహింసలు
పాకిస్తాన్ పీకల్లోతు ఆర్థిక కష్టాలతో సతమతం అవుతోంది. ఆల్ టైం గరిష్టానికి చేరుకుంది. నిత్యవసరాల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. మరోవైపు కరెంట్ ఛార్జీలు, కరెంట్ కోతులు, గ్యాస్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు విపరీతంగా పెరగడంతో పాకిస్తాన్ జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా కరెంట్ ఛార్జీల భారీగా వస్తుండటంతో జనాలు వీటిని కట్టవద్దని నిరసన తెలుపుతున్నారు.
ఇదిలా ఉంటే పాకిస్తాన వ్యాప్తంగా గోధుమ పిండి కష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ టీనేజ్ బాలుడు ఒక దుకాణంలో పిండిని దొంగిలించడంతో సాదిక్ అనే దుకాణదారు ఆ పిల్లాడిని కట్టేసి కొట్టని వీడియో అక్కడ వైరల్ గా మారింది. మియాన్ చన్నూలోని బోరా చౌక్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై అక్కడి ప్రజలు తీవ్ర ఘటన వ్యక్తం అవుతోంది. చిత్రహింసల ఘటనపై స్థానిక అధికారులు ఏం చేయడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజల నుంచి తీవ్ర నిరసన రావడంతో పోలీసులు సదరు నిందితుడిని అరెస్ట్ చేశారు.
సాయిచంద్ కుటుంబానికి అండగా బీఆర్ఎస్.. కుటుంబంలోని అందరికీ చెక్కులు..
తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు సాయిచంద్ కుటుంబానికి బీఆర్ఎస్ ఆర్థిక సాయం చేసింది. ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందడంతో సాయిచంద్ కుటుంబాన్ని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ రూ. 1.50 కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాల మేరకు సాయిచంద్ కుటుంబానికి సోమవారం ఆర్థిక సాయం అందజేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లి ఆయన భార్య, పిల్లలకు చెక్కులు అందజేశారు. సాయిచంద్ భార్య వేదా రజనీకి రూ. 50 లక్షలు, పిల్లలు చరీష్, మీనల్ రూ. 25 లక్షలు చెక్కుల రూపంలో అందజేశారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి, కేసీఆర్ నాయకత్వానికి ఆశాకిరణం అయిన సాయిచంద్ లేకపోవడం జీర్ణించుకోలేని విషయమని ఆ సందర్భంగా మంత్రి సబితారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆధార్ తో లింక్ తర్వాత దొంగ ఓట్లు బయటికి వస్తున్నాయి
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దొంగ ఓట్లను పుట్టించిందే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని ఆయన ఆరోపించారు. ఆధార్ కార్డుతో లింక్ తర్వాత దొంగ ఓట్లు బయటికి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన కుటుంబ సభ్యులు మళ్ళీ నిన్న కలిసినట్లుగా ఉంది అని మంత్రి వ్యాఖ్యనించారు.
దివంగత నేత ఎన్టీఆర్ మంచి నాయకుడు. చెల్లని నాణాన్ని నందమూరి తారక రామారావు పేరు మీద విడుదల చేశారు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ నాణెం ప్రజల్లో చలామణి అయ్యేలా ఉండాలి.. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని ఎందుకు పిలువలేదు అని ఆయన ప్రశ్నించారు. ఇక, తూనికలు, కొలతల్లో మోసాలకు పాల్పడుతున్న పలు దుకాణాలపై కేసులు నమోదు చేశామని మంత్రి అన్నారు. నిబంధనలు పాటించని వ్యాపార సంస్థలపై టీడీపీ హయాంలో కేవలం 21 కోట్ల రూపాయల జరిమానా విదిస్తే.. వైసీపీ పాలనలో 40 కోట్ల రూపాయల ఫైన్ వేశామని కారుమూరి తెలిపారు. నిబంధనలు పాటించని వ్యాపార సంస్థలపై 1162కు పైగా కేసులు నమోదు చేసినట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు.
ఆ వ్యవస్థలను కేసీఆర్ సర్కారు నిర్వీర్యం చేస్తుంది
నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో దిశా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ అరవింద్, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల శంకుస్థాపనకు, ప్రారంభోత్సవాలకు ఎంపీకి ఆహ్వానం ఎందుకివ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి డిపార్ట్మెంట్ లో కేంద్రం నిధులను ప్రజలకు తెలియకుండా దాచిపెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ఉపాధి హమీ పథకం నిధుల దుర్వినియోగంపై ఆయన ధ్వజమెత్తారు. పంట నష్టం క్షేత్ర స్థాయిలో అంచనా వేయకుండానే ఎలా నిర్ణయించారన్న ఎంపీ అరవింద్.. పంచాయతీల తీర్మాణం లేకుండా అభివృద్ధి పనుల ప్రొసీడింగ్స్ ఎలా ఇస్తున్నారని సర్పంచుల మండిపడ్డారు. ప్రజా వ్యవస్థను, అన్నీ వ్యవస్థలను కేసీఆర్ సర్కారు నిర్వీర్యం చేస్తుందని ఎంపీ అరవింద్ సీరియస్ అయ్యారు.
కేరళ ప్రజలకు ఓనం శుభాకాంక్షలు తెలిపిన MK స్టాలిన్
కేరళ ప్రజలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మంగళవారం మలయాళంలో ఓనం శుభాకాంక్షలు తెలిపారు. తన X (ట్విట్టర్)లో మళయాళంలో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో DMK చీఫ్.. అందరినీ ఒకేలా చూసే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కోసం కేరళ, తమిళనాడు రెండూ కలిసి నిలబడాలని కోరారు. పురాణ రాక్షస రాజు మహాబలి హయాంలో మాదిరిగానే దేశంలోనూ ఐక్యత, సమానత్వం నెలకొనాలని ఆకాంక్షించారు.
“అందరినీ సమానంగా చూడగలిగే పరస్పర ప్రేమ, సామరస్యం కలిగిన జానపదంగా మారండి” అని స్టాలిన్ కేరళీయులకు పువ్వులు, విందులు మరియు సంతోషాలతో నిండిన ఓనం శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మధ్య వివిధ అంశాలపై వాగ్వాదం కొనసాగుతున్న నేపథ్యంలో స్టాలిన్ రాజకీయ వ్యాఖ్యలతో పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, డిఎంకె ఇతర పార్టీలతో కూడిన భారత కూటమి ఏర్పడిన విషయం తెలిసిందే. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రంలో అధికార బిజెపికి విపక్షాల కూటమి సవాలుగా నిలిచింది.
ప్రజాసేవకు డబ్బు సంచులకు మధ్య ఎన్నికల యుద్ధం మొదలవుతుంది
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు లేవనెత్తారు సీతక్కని ఓడిస్తామని, ప్రజాసేవకు డబ్బు సంచులకు మధ్య ఎన్నికల యుద్ధం మొదలవుతుందన్నారు ఎమ్మెల్యే సీతక్క. ఇవాళ ములుగు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీతక్క మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెను మాట్లాడుతూ.. నేను ప్రతిపక్షంలో ఉన్న ప్రజలతోటే ఉన్న ఎక్కడ భూకబ్జాలు పాల్పడలేదు, అక్రమ కేసులు పెట్టించలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదని ఆమె అన్నారు. మిడతల దండులాగా బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారని, నన్ను ఓడించడానికి డబ్బు సంచులతో తిరుగుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ మంత్రులకు పక్క నియోజకవర్గాల మీద ఉన్న ప్రేమ ములుగు మీద ఉండటం లేదని, ప్రశ్నించే గొంతును చట్టసభలోకి రాకుండా అడ్డుకోవడానికి భారీ కుట్రకు తెరలేపుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టం ఎక్కడున్నా సీతక్క అక్కడఉంటుందని, ప్రజలలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక నన్ను టార్గెట్ చేస్తున్నారని ఆమె అన్నారు.
గ్యాస్ సిలిండర్ పై రూ. 200 రాయితీ
సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. వంటగ్యాస్ ధరలను రూ.200 వరకు తగ్గించాలని ఇప్పటికే మోడీ సర్కార్ నిర్ణయించింది. త్వరలో సిలిండర్‌పై రూ.200 తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించబోతోంది. విపక్షాలకు వంటగ్యాస్ ధరలు ఆయుధంగా మారాయి.. అయితే, అతి త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల జరుగబోతున్నాయి. గ్యాస్ ధరలు జనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయన్న నివేదికలతో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకోబోతుంది.
అయితే, ఇవాళ కేంద్రం ఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర 11 వందల రూపాయల వరకు ఉంది. మోడీ ప్రధానమంత్రి కాక ముందే ఈ గ్యాస్ సిలిండర్ ధర రూ. 450గా ఉంది. ఈ తొమ్మిదేళ్ల కాలంలో వంట గ్యాస్ మూడింతలు పెరిగింది. దీనికి తోడు నిత్యావసర సరుకుల ధరలు సైతం భారీగా పెరిగిపోయాయి. ఇది మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపించింది.