తెలంగాణలో రానున్న ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కీలకఘట్టం ప్రారంభమైంది. దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 25తో ముగియడంతో.. నేడు ప్రదేశ్ ఎన్నికల కమిటీ-పీఈసీ సమావేశం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సమావేశంలో చర్చ అంతా అభ్యర్థుల ఎంపిక మీద.. కులాల సమీకరణ పైనా చర్చ చేశామన్నారు. అందరిని సంప్రదించాలి నేది చర్చ అని, మంచి చర్చ జరిగిందని ఆయన అన్నారు. ప్రభుత్వం వచ్చేందుకు అవసరం సీట్లు గెలుపు ఎలా అనే చర్చ చేశామని ఆయన పేర్కొన్నారు. పొత్తుల అంశం చర్చ జరగలేదని, అది పీసీసీ.. ఇంచార్జి స్థాయిలో జరిగే చర్చ అని ఆయన అన్నారు.
10 రోజుల్లో ప్రక్రియ పూర్తి అవుతోందని ఆయన తెలిపారు. కోవర్టులు పంపాము అనేది పిచ్చి మాటలు అని, మతిస్థిమితం లేదు వాడికి.. మెచ్యూరిటీ లేని నేతలు మట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘జాతీయ పార్టీలో కోవర్టులు అంత ఈజీ నా.. మర్రి జనార్ధన్ రెడ్డి తోపు అనుకుంటే ఎలా.. నువ్వు కలుస్తా అని స్టేత్ మెంట్ ఇచ్చాడు.. మా వాళ్ళు ఇషారా ఇస్తే చాలు.. అంత సీన్ లేదు.. కానిస్టేబుల్ లేకుండా రమ్మను బయటకు’ అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.