Leading News Portal in Telugu

MLC Kavitha : ఎల్పీజీ సిలిండర్ ధరల తగ్గింపుపై కల్వకుంట్ల కవిత ట్వీట్


కేంద్ర ప్రభుత్వం ఇంటి గ్యాస్‌ సిలిండర్‌ ధరను తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. వినియోగదారులకు ఉపశమనంగా, రక్షా బంధన్ సందర్భంగా మహిళలకు కానుకగా 14.2 కిలోల ఎల్‌పిజి వంట గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర మంత్రివర్గం మంగళవారం రూ 200 తగ్గించింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై కేంద్రం విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. అయితే.. వంట గ్యాస్ సిలిండర్ ధరల తగ్గింపు పై కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో స్పందించారు. ఇది కానుక కాదు… జేబులను గుల్ల చేసి దగా చేయడమన్నారు.

ఇది కానుక కాదు. సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసి దగా చేయడమే. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమేనని ఆమె విమర్శించారు. వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి నామమాత్రంగా తగ్గించి ఎంతో లబ్ధి చేశామని కేంద్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. గత పది ఏళ్లలో బిజెపి ప్రభుత్వం ఒక ఎల్పిజి సిలిండర్ పై రూ. 800 పెంచి తాజాగా కేవలం రూ. 200 మాత్రమే తగ్గించిందని పేర్కొన్నారు. “ఇది కానుక కాదు. సామాన్య ప్రజల జేబులను గుల్ల చేసి దగా చేయడమే. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడమే” అని ఘాటుగా స్పందించారు ఎమ్మెల్సీ కవిత.