మానుకోట జిల్లాలో కాంగ్రెస్ ఆశావహుల సంఖ్య పెరిగింది టికెట్ కోసం ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు.. మానుకోట కోసం ఆరుగురు పోటీ పడుతుండగా, డోర్నకల్ టికెట్ కోసం ముగ్గురు ప్రయత్నాలు చేస్తున్నాడంతో .మానుకోట రాజకీయం రంజుగా మారింది
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ ఆశావహులు టికెట్ కోసం తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థులు ఖరారు కావడంతో కాంగ్రెస్ ఆశవహుల్లో ఆశలు మరింత పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన ఉన్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందంటూ టికెట్ల వేటాను ముమ్మరం చేశారు దింతో మానుకోట జిల్లాలలో కాంగ్రెస్ ఆశావహుల సంఖ్య పెరిగింది మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్ డోర్నకల్ రెండు నియోజకవర్గల కాంగ్రెస్ టికెట్ కోసం 9 మంది పోటీ పడుతున్నారు మానుకోట కాంగ్రెస్ టికెట్ కోసం ఆరుగురు పోటీ పడుతుండగా, డోర్నకల్ టికెట్ కోసం ముగ్గురు మధ్య పోటీ జోరుగా ఉంది
మహబూబాబాద్ అసెంబ్లీ టికెట్ కోసం కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్, బెల్లయ్య నాయక్, డాక్టరురళీనాయక్, నునావత్ రాధ, సునావత్ రమేశ్ దస్రు నాయక్. గాంధీ భవన్ లో టికెట్ కోసం అప్లై చేసుకున్నారు. ఇందులో ఏఐసీసీ అధినాయకత్వంతో మంచి సంబంధాలు ఉండడంతో టికెట్ తనకే ఖాయం అవుతుందని బలరాం నాయక్ ధీమాగా ఉన్నారు. . ఇక స్థానిక నినాదమే ఆయుధంగా డాక్టర్ మురళీనాయ తండాల వెంట తిరుగుతున్నారు. టికెట్ తనకే వస్తుందని, ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ఇక గతంలో లంబాడా హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేసినందున, జాతీయ స్థాయిలో పరిచయాలు ఉన్నందున తనకు టికెట్ దక్కుతుందని బెల్లయ్యనాయక్ ఆశగా ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య టికెట్ పోటీ తీవ్రంగా ఉంది నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించిన ఈ ముగ్గురు టికెట్ పైనా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు
డోర్నకల్ లో కాంగ్రెస్ టికెట్ కోసం టఫ్ ఫైట్ నడుస్తోంది డోర్నకల్ నియోజకవర్గం నుంచి జాటోతు రామచంద్రునాయక్ మాలోతు నెహ్రూ నాయక్, సూనావత్
భూపాల్నాయక్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. గతంలో, రెండు సార్లు పోటీ చేసి ఓడిన డాక్టర్ జాటోతు రా మచంద్రునాయక్ ఈ సారి టికెట్. గెలుపు రెండూ తనవేనని ధీమాతో ఇంటే.. మరోవైపు పారిశ్రామిక వేత్త మాలోతు నెహ్రూ నాయక్ నాలుగేళ్లు గా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రేవంత్ రెడ్డి సన్నిహితులతో ఉన్న సంభందలతో ఈ సారి ఎలాగైనా టికెట్ తానకే దక్కించుకునే ధీమా తో ఆయన ప్రయత్నాలను .ముమ్మరం చేశారు .. మొన్నటి వరకు పెద్దగా ఎక్కడ కనిపించని ఇక కిసాన్ పరివార్ సంస్థ నిర్వాహకుడు భూపాల్ నాయక్ హడహుడి తో ఈ ఇద్దరు సీనియర్లు సైతం హడలిపోయే పరిస్థితి కనిపిస్తుంది .. విద్యార్థులకు బాస్ పాసులు. ఉచితంగా అందించడమే కాదు రైతులతో సమావేశలు పెడుతూ నియోజకవర్గంలో అప్పుడే ప్రచారానికి తెర తీయాడంతో భూపాల్ నాయక్ పేరు టికెట్ రేసులోకి వచ్చేసింది హైకమాండ్ వద్ద తనకు
ఉన్న పరిచయాలే తనకు కలిసివస్తాయని ధీమాతో ఆయన అప్పుడే ప్రచారమా మొదలెట్టారు.
ఇన్ని రోజులు తండాల వెంట తిరిగిన లీడర్లు ప్రస్తుతం. వారంలో మూడు రోజులు హైదరాబాద్లోనే మకాం వేస్తూ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా మానుకోట జిల్లాలో కాంగ్రెస్ ఆశావహులు టికెట్ల కోసం చేస్తున్న ప్రయత్నాలు మానుకోట జిల్లాలో రాజకీయ హీట్ ని పెంచుతున్నాయి