Leading News Portal in Telugu

Telangana: తెలంగాణ సర్కార్ మరో శుభవార్త.. అర్చకుల జీతం రూ.10 వేలకు పెంపు


Telangana: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కేసీఆర్ ప్రభుత్వం తీపి కబురు చేప్తూనే ఉంది. ఇప్పుడు పూజారులు శుభవార్త విన్నారు. ధూప దీప నైవేద్య పథకం కింద అర్చకులకు గౌరవ వేతనం రూ.6000 నుంచి రూ.10,000కు పెంచుతూ ప్రభుత్వం జియోను విడుదల చేసింది. కాగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సెయం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి పాలనలో అర్చకులకు ధూప దీప నైవేద్య పథకం కింద రూ.2,500 మాత్రమే వచ్చేది. ఈ వేతనంతో అర్చకులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన సీఎం కేసీఆర్ వారి వేతనాన్ని రూ.6వేలకు పెంచారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ధూప దీప నైవేద్య అర్చకుల వేతనాన్ని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఉత్తర్వులు జారీ చేశామన్నారు. అర్చకుల వేతనాలు పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమన్నారు. గతంలో 1805 దేవాలయాలకు మాత్రమే ధూప దీప నైవేద్య పథకాన్ని అమలు చేస్తే దశలవారీగా మరిన్ని ఆలయాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని మొత్తం 6,541 దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. ధూప దీప నైవేద్య పథకానికి సంవత్సరానికి 78.49 కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు.

Read also: Health Tips : రాత్రి నిద్రపోయే ముందు తేనె తీసుకుంటే.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

రాష్ట్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మూడు నెలల క్రితమే టీఎస్‌ఎస్‌ ఉద్యోగుల పీఆర్‌సీకి ఆర్థిక శాఖ క్లియరెన్స్‌ ఇచ్చింది. PRC 2020 ప్రకారం, TSS ఉద్యోగుల వేతనాలు పెరుగుతాయి. పెరిగిన PRC జూన్ 1, 2021 నుండి సంబంధిత ఉద్యోగులకు వర్తిస్తుంది. అయితే పీఆర్సీ అమలుకు తదుపరి చర్యలు తీసుకోవాలని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. తెలంగాణ సాంస్కృతిక శాఖలో 583 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే.. ప్రస్తుతం పే స్కేల్‌పై 30 శాతం పీఆర్సీని అమలు చేస్తూ.. కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉద్యోగుల వేతన స్కేలు రూ. 24,514 ఉండగా.. ఇప్పుడు అమల్లోకి వచ్చిన పీఆర్సీ ప్రకారం ఒక్కో వ్యక్తికి దాదాపు 7,300 జీతం పెరగనుంది. ఈ కీలక ప్రకటనపై ఆయా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Astrology: ఆగస్టు 30, బుధవారం దినఫలాలు