Minister Mahender Reddy: రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 24న పట్నం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. పట్నం సచివాలయం మొదటి అంతస్తులోని కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళవారం సమాచార శాఖ అధికారులు మంత్రి మహేందర్‌రెడ్డిని కలిసి సన్మానించారు.
Read also: Telangana Rains: వాతావరణశాఖ కీలక అప్డేట్.. సెప్టెంబర్ 2 తర్వాత భారీ వర్షాలకు ఛాన్స్
సీఎం కేసీఆర్ కేబినెట్ లోకి పట్నం మహేందర్ రెడ్డికి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఆయన ఈ నెల 24న రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్నం మహేందర్ రెడ్డితో ప్రమాణం చేయించారు. 1994 నుంచి తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం నుంచి మహేందర్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. 1994 నుంచి 2009 వరకు టీడీపీ క్యాండిడెట్ గా తాండూర్ నుంచి గెలిచిన ఆయన.. 2014 ఎన్నికల ముందు టీడీపీని వీడి బీఆర్ఎస్ పార్టీకి జాయిన్ అయ్యాడు. అయితే, 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన పట్నం మహేందర్ రెడ్డికి కేసీఆర్ మంత్రి వర్గంలో చోటు దక్కింది. రవాణా శాఖ మంత్రి ఆయన పని చేశారు. 2018 ఎన్నికల్లో మరోసారి తాండూరు నుంచి పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక, కాంగ్రెస్ అభ్యర్థిగా బరలోకి దిగిన పైలెట్ రోహిత్ రెడ్డి చేతిలో పట్నం మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్గికి బీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్సీ పదవిని ఇచ్చింది. గత కొంతకాలంగా తాండూరు నియోజకవర్గంలో పైలెట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పైలెట్ రోహిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి మధ్య బహిరంగంగానే పలుసార్లు తోపులాట, విమర్శలు చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక, బీఆర్ఎస్ పార్టీ ఇరువురి నేతల మధ్య రాజీకి ప్రయత్నించింది. కానీ, ఎవరూ కూడా బెట్టు వీడలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మరోసారి పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి వర్గంలోకి స్థానం కల్పిస్తామని చెప్పి.. రోహిత్ రెడ్డికి తాండూర్ ఎమ్మెల్యేగా మరో అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.
Allu Arjun : ఫ్యాన్స్ కి స్పెషల్ వీడియోతో సర్ప్రైస్ ఇచ్చిన ఐకాన్ స్టార్..