Leading News Portal in Telugu

YS Sharmila: ఏంది షర్మిలక్క.. రాజీవ్ గాంధీని అట్లా ఎట్లా కలిశావ్..



Sharmila

ప్రస్తుతం సోషల్ మీడియా శకం నడుస్తోంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు ఎవరైనా ఏదైనా పొరపాటున నోరుజారితే అంతే సంగతలు.. నెట్టింట నానా రచ్చ చేసేందుకు జనాలు సిద్ధంగా ఉంటారు. అయితే, తాజాగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై నెట్టింట భారీగా ట్రోలింగ్ కు గురౌవుతుంది. ఇందుకు కారణంగా ఏంటంటే.. రాజీవ్ గాంధీని కలిశానని వైఎస్ షర్మిల నోరు జారడమే.. వివరాల్లోకి వెళితే.. వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే దిశగా ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం తన భర్త బ్రదర్ అనిల్ తో కలిసి ఢిల్లీ వెళ్లిన వైఎస్ షర్మిల ఇవాళ (గురువారం) ఉదయం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. 10 జనపథ్‌లోని సోనియా గాంధీ నివాసానికి వెళ్లిన షర్మిల దాదాపు 30 నిమిషాల పాటు ఆమెతో బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఈ మీటింగ్ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కూడా ఉన్నారు.

Read Also: Jailer Vinayakan: నీతో పాటు నీ తల్లిని తీసుకొని రూమ్ కు రా.. రజినీ విలన్ పై లైంగిక వేధింపుల కేసు

అయితే, ఈ మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల.. సోనియా గాంధీని, రాజీవ్ గాంధీని కలవటం జరిగింది.. చాలా నిర్మాణాత్మక చర్చ జరిగింది.. తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా రాజశేఖరరెడ్డి బిడ్డ నిరంతరం పని చేస్తూనే ఉంది.. మీ అందరితో ఒకే విషయం చెబుతున్నా.. కేసీఆర్ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది అని ఆమె వ్యాఖ్యానించింది.

Read Also: Puri Jagannadh: పూరి లవ్ స్టోరీ విన్నారా.. లావణ్యని అలా ఫిదా చేశాడట!

ఇక, ఇక్కడ రాహుల్ గాంధీ పేరుకు బదులు రాజీవ్ గాంధీ అంటూ షర్మిల నోరు జారడంతో.. నెటిజన్లు ఆమెపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. 1991లోనే మరణించిన రాజీవ్ గాంధీని ఈరోజు ఢిల్లీలో కలిసొచ్చిన గొప్ప నాయకురాలు మన షర్మిలమ్మ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మీరు ఇందిరా గాంధీని కలవలేదా? అంటూ మరో నెటిజన్ క్వశ్చన్ చేశాడు.. కొందరైతే.. షర్మిల సోదరుడు ఏపీ సీఎం జగన్‌ను కూడా ప్రస్తావిస్తూ విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు.