వికారాబాద్ జిల్లా పరిగి తహసీల్దార్ కార్యాలయాన్ని 25 మంది యువకులు ముట్టడించారు. లక్ష్మీదేవి పల్లి గ్రామానికి చెందిన సర్వేనెంబర్ 94, 95, 96లో గల 22 ఎకరాల 26 గుంటల భూమిని సదరు యువకులు అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ సమయంలో రూ. 10 లక్షలు, ఆ తర్వాత రూ. 50 లక్షలు భూమి యజమాని వెంకటరాములకు చెల్లించామని వారు పేర్కొన్నారు. దీంతో భూమి యాజమాని వెంకట్ రాములు గుట్టు చప్పుడు కాకుండా మరొకరికి రిజిస్ట్రేషన్ చేయించాడంతో.. విషయం తెలుసుకొని తహసిల్దార్ కార్యాలయాన్ని 25 మంది యువకులు ముట్టడించారు.
ముందు గానే తహసీల్దార్ కు భూమి విషయంపై ఫిర్యాదు రిజిస్ట్రేషన్ ఎవరికి చేయొద్దని యువకులు తెలిపారు. ఫిర్యాదు స్వీకరించకుండానే గుట్టుచప్పుడు కాకుండా 14 ఎకరాలు భూమిని పరిగి తహసిల్దార్ దానయ్య రిజిస్ట్రేషన్ చేశాడని వారు ఆరోపించారు. దీంతో సుదర్శన్ అనే యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేయడంతో వెంటనే స్పందించి పోలీసులు పెట్రోల్ బాటిల్ని లాక్కున్నారు.
భూమి యజమాని తమకు అగ్రిమెంట్ చేసి ఇతరులకు అమ్ముకోవడం దారుణమని సదరు యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో భూయజమాని వెంకట్ రాములుపై తగిన చర్యలు తీసుకోవాలని బాధిత యువకులు డిమాండ్ చేశారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. భూమి యజమాని వెంకట్ రాములుతో పాటు 25 మంది యువకులను పోలీసులు విచారణ చేస్తున్నారు.