Leading News Portal in Telugu

DK Aruna: నా నియోజక అభివృద్ది చేసే అవకాశాన్ని కోల్పోయా… అరుణ ఆవేదన


DK Aruna: నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం కోల్పోయినని, ఇప్పుడు అమలు చేయాలని మాజీ మంత్రి డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్య కార్యాలయంలో తెలంగాణ హైకోర్టు కాపీని అరుణ సమర్పించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది ఆగస్టు 24న అనర్హత వేటు వేసింది. గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. డీకే అరుణ ఇప్పటికే హైకోర్టు తీర్పు కాపీని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌కు సమర్పించారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో ఆమె ఈరోజు భేటీ కానున్నారు. అయితే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అందుబాటులోకి రాలేదు. దీంతో తెలంగాణ హైకోర్టు కాపీని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యకు ఇచ్చేందుకు డీకే అరుణ అసెంబ్లీకి చేరుకున్నారు. అయితే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలో పని ఉండడంతో ఆయన ఈరోజు అసెంబ్లీకి రాలేదు.

Read also: Yogi Adityanath: జమిలి ఎన్నికలకు యోగి మద్దతు.. మరికొందరు నేతలు ఏమన్నారంటే..?

అంతేకాదు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు కూడా అందుబాటులో లేరు. ఇక చేసేది ఏమీ లేక అసెంబ్లీ కార్యాలయంలో హైకోర్టు తీర్పు కాపీని డీకే అరుణ సమర్పించారు. హైకోర్టు తీర్పు మేరకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. తెలంగాణ హైకోర్టు తీర్పు కాపీ రావడం ఆలస్యమైందన్నారు. అయితే ఈరోజు హైకోర్టు ఆర్డర్ కాపీ ఇవ్వడానికి వచ్చానని అన్నారు. స్పీకర్, సెక్రటరీ అందుబాటులో లేరని, నిన్న స్పీకర్‌కి ఫోన్ చేశానని అన్నారు. ఏదో కార్యక్రమంలో ఉన్నానని సెక్రటరీ చెప్పాడని తెలిపారు. స్పీకర్ తన అధికారాలను ఉపయోగించి కోర్టు ఆదేశాలను అమలు చేయాలన్నారని కోరారు. స్పీకర్, ప్రభుత్వం వెంటనే కోర్టు ఆదేశాలను గౌరవించాలని తెలిపారు. నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం కోల్పోయినా… ఇప్పుడు అమలు చేయాలని ఆమె అన్నారు. రోజూ వస్తున్న సెక్రటరీ ఈరోజు అసెంబ్లీకి ఎందుకు రాలేదో తెలియదన్నారు. ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చిందేమో అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Ghanpur MLA Ticket: ఒక్క ఛాన్స్ ప్లీజ్.. బీఆర్ఎస్ అధిష్టానికి జానకీపురం సర్పంచ్ రిక్వెస్ట్