తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో టీచర్ల బదిలీలు మరియు పదోన్నతుల ప్రక్రియకు తేదీలు ఖరారు చేసింది.దీనిపై శుక్రవారం విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల హైకోర్టు టీచర్ల బదిలీలకు అనుమతి ఇవ్వడంతో తాజాగా బదిలీ ల ప్రక్రియను ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది.. రాష్ట్రవ్యాప్తం గా 1.05 లక్షల మంది టీచర్లు ఉన్నట్లు సమాచారం..రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గరపడటంతో టీచర్స్ బదిలీ ల ప్రక్రియ ను ప్రభుత్వం స్పీడ్ అప్ చేస్తుంది.ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ఈ విధంగా వుంది.ఈనెల 3వ తేదీ నుంచి 5వ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించింది..ఈనెల 6 మరియు 7 వ తేదీల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసిన కాపీలను డీఈవో కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది..అలాగే 8 మరియు 9 తేదీల్లో దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు అధికారులు వెల్లడిస్తారు. 10, 11 తేదీల్లో అభ్యంతరాలను స్వీకరిస్తారు..
12, 13వ తేదీ న సీనియారిటీ జాబితాలను ప్రచురిస్తారు.14 వ తేదీన ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. 15 వ తేదీన ఆన్లైన్ ద్వారా ప్రధానోపాధ్యాయుల బదిలీలు నిర్వహించడం జరుగుతుంది.. 16వ తేదీన ప్రధానోపాధ్యాయుల ఖాళీలను ప్రదర్శిస్తారు. 17, 18, 19 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎంలుగా పదోన్నతులును కల్పిస్తారు. 20,21 తేదీల్లో ఖాళీ అయిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ప్రకటించడం జరుగుతుంది.21వ తేదీ న వెబ్ ఆప్షన్ల ఎంపిక జరుగుతుంది. 22వ తేదీ న ఎడిట్ ఆప్షన్ అవకాశం కల్పిస్తారు. 23,24 వ తేదీ న స్కూల్ అసిస్టెంట్ బదిలీలు జరుగుతాయి. అలాగే 24 వ తేదీ న స్కూల్ అస్టింట్ ఖాళీలను వెల్లడిస్తారు. 26, 27, 28 తేదీల్లో ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతులు కల్పిస్తారు.29, 30, 31వ తేదీల్లో ఎస్జీటీ ఖాళీల వివరాలు తెలియజేస్తారు .అక్టోబర్ 2వ తేదీ న ఎడిట్ ఆప్షన్స్ అవకాశం ఉంటుంది. అక్టోబర్ 3వ తేదీ న ఎస్జీటీ, భాషాపండితులు, పీఈటీల బదిలీలు నిర్వహిస్తారు.అక్టోబర్ 5వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అప్పీల్ చేసుకునే అవకాశం వుంది.