Double Bedroom Houses: హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం గ్రేటర్ పరిధిలో లక్ష పడక గదుల ఇళ్ల పంపిణీ ప్రక్రియను రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే.. ఈ ప్రక్రియను ఐదు నుంచి ఆరు దశల్లో.. గ్రేటర్ హైదరాబాద్‌లో ఎంపికైన లబ్ధిదారులకు మొదటి విడతగా సెప్టెంబర్ 2న డబుల్ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడుతలో 11 వేల 700 ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. విడతల వారీగా పంపిణీ చేసి అక్టోబర్ వరకు ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 70 వేల ఇళ్లు పూర్తి చేసి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
Read also: Sri Lakshmi Stotram: సిరి సంపదలతో మీ ఇల్లు నిలయమవ్వాలంటే ఈ స్తోత్రాలు వినండి
మొదటి విడుతలో కుత్బుల్లాపూర్‌లో మంత్రి కేటీఆర్, శేరిలింగంపల్లిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కొల్లూరులో హరీశ్ రావు, మేడ్చల్‌లో మల్లారెడ్డి, ఉప్పల్‌లో మేయర్ విజయలక్ష్మి, ప్రతాపసింగారంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మహాశ్వరంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ పాతబస్తీలో, రాజేంద్రనగర్‌లోని పట్నం మహేందర్ రెడ్డి డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఆగస్టు 15న ప్రకటించిన సీఎం కేసీఆర్.. మరుసటి రోజే సంబంధిత అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. పంపిణీకి సంబంధించి అధికారులకు కీలక సూచనలు చేశారు. మురికివాడల్లో నివసించే పేదల గుడిసెలు తొలగించి వాటి స్థానంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించామని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో 4,500 మంది పేదలకు ఇళ్లు మంజూరు చేశామన్నారు. మరో 70 వేల ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఇంటింటి సర్వే నిర్వహించి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తున్నామని మంత్రి తెలిపారు. అనంతరం వచ్చిన దరఖాస్తుల్లో అర్హులను గుర్తించి వారి పేర్లతో లక్కీ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు.
Gold Price Today : మహిళలకు బ్యాడ్ న్యూస్.. రెండో రోజు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే?