Leading News Portal in Telugu

Kishan Reddy: అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం ఫెయిల్


కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలోకి విశ్వకర్మ సంఘం నేతలతో పాటుజహీరాబాద్ కు చెందిన వివిధ పార్టీల నేతలు చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈటెల రాజేందర్ చాలా మందితో మాట్లాడారు.. వారందరూ పార్టీలో చేరనున్నారు అని ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున చేరికల కార్యక్రమం ఉండబోతుంది.. కేసీఆర్ పాలనలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగలేదు.. అందరికీ సమ న్యాయం జరగాల్సి ఉంది.. బడుగు బలహీనవర్గాలకు బీజేపీ పెద్ద పీఠ వేయబోతుంది అని ఆయన తెలిపారు. గజ్వేల్ వెళ్తా అంటే కేసీఆర్ కు ఉలుకు ఎందుకు.. గజ్వేల్ ప్రజలకు అన్ని అందితే ఎందుకు కేసీఆర్ భయ పడుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు.

దళితుల అభ్యున్నతి గజ్వేల్ లో జరిగిందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గజ్వేల్ అయన ప్రైవేట్ ఆస్తా.. అపే అధికారం ఎక్కడిది… నిజాం రాసిచ్చార, ఓవైసీ రాసిచ్చారు… అది మీ జాగీరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెవరినో తీసుకొచ్చి చూపారు కదా.. బరితెగింపు గా వ్యవహరిస్తే… తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది… మాదేమి అషమాసి పార్టీ కాదు అని ఆయన హెచ్చరించారు. అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది.. మెజారిటీ రైతులు అన్యాయంకి గురయ్యారు.. మీరు ప్రకటించిన ఎమ్మెల్యేలు.. దళిత బంధులో కమిషన్, ఇసుక దందా, గ్రానైట్ వ్యాపారంలో కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ప్రభుత్వం అయితే.. కల్వకుంట్ల ప్రభుత్వము వాటాల ప్రభుత్వం అంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. మీ ఎమ్మెల్యేలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణను దోచుకున్నారు.. ధరణి బాధితులు వందల మంది వచ్చి కలుస్తున్నారు.. ఈ నెల 17 నుంచి మోడీ జన్మదిన వేడుకలు.. తెలంగాణ విమోచన ఉత్సవాలను గ్రామ గ్రామాన నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నాడు. అధికారికంగా, పార్టీ తరపున నిర్వహిస్తాం.. రజాకార్ల అరాచకాలకు గురైన ప్రాంతాలకు వెళ్తాం.. పోరాడిన వారిని స్ఫూర్తిగా తీసుకుంటాం.. కృష్ణా యాదవ్ బీజేపీ లో చేరుతారు అని కిషన్ రెడ్డి చెప్పారు.