Leading News Portal in Telugu

KVP Ramachandra Rao: రాహుల్ ని పీఎం చేయడమే వైఎస్ఆర్ ఆశయం.. మనం నిజం చేద్దాం..


హైదరాబాద్ లో ‘రైతే రాజైతే…’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పాల్గొన్నారు. ఈ పుస్తకాన్ని సంయుక్తంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ రామచంద్రరావు, ఎన్ రఘువీరా రెడ్డిలు సంయుక్తంగా రాశారు. ఈ పుస్తకాన్ని దిగ్విజయ్ సింగ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేవిపీ మాట్లాడుతూ.. రఘువీరా రెడ్డి సహకారంతో.. ఆయనకున్న వ్యవసాయ అనుభవంతో ఈ పుస్తకాన్ని తీసుకువచ్చామన్నారు. ఈ కార్యక్రమానికి దిగ్విజయ్ సింగ్ రావడం సంతోషంగా ఉంది. వైఎస్సార్ గురించి నేను తీసుకు వచ్చిన నాలుగు పుస్తకాల్లో మూడింటికి దిగ్విజయ్ ముఖ్య అతిథి.. నాకు రాజశేఖర్ రెడ్డికి సోదర అనుబంధం.. భావి కార్యకర్తలు ఏ విధంగా ఉండాలో అని చెప్పి.. మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని ధీమాగా చెప్పిన రేవంత్ రెడ్డికి కృతఙ్ఞతలు అని కేవిపీ తెలిపారు.

వైఎస్సార్ ప్రజాప్రస్థానం స్పూర్తితో పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్కకి కేవీపీ రామచంద్రరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ధన్యవాదాములు.. మేమంతా కష్ట సుఖాలను పంచుకుంటాం.. రాష్ట్రంలో వైఎస్సార్ పథకాలను.. ఆయన ఆలోచనలను పుస్తకంలో రాసాను.. మీకు నచ్చితే తెలంగాణ నాయకత్వం వాటిని పరిశీలించండి అని ఆయన అన్నారు. రేపు అధికారంలోకి వచ్చాక నన్ను ఆంధ్రప్రదేశ్ వాడు అని అనకండి.. నేను తెలంగాణ వాడినే.. ఇక్కడే ఓటు ఉంది.. తెలంగాణ మట్టిలోనే కలిసిపోతాను.. నన్ను మీ వాడిగానే చూసుకోండి.. వైఎస్సార్ ఎలా ముందుకు వెళ్లారో అలా మనం ముందుకు వెళ్తే తప్పకుండా 2023లో అధికారంలోకి వస్తాం.. రాహుల్ ని పీఎం చేయడం వైఎస్ఆర్ ఆశయం.. దాన్ని మనం నిజం చేద్దాం.. లోక్ సభ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో మొత్తం ఎంపీ సీట్లను గెలిపిద్దాం అంటూ కేవీపీ పిలుపునిచ్చారు.