Godavari Anji Reddy: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురం పట్టణంలో వివిధ పోలింగ్ బూతులను రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఓటు లేని వాళ్లు ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు.
అదేవిధంగా సెప్టెంబర్ 3వ తేదీన ప్రతి బూత్‌లో బీఎల్వో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటారని, వాళ్ల సేవలను ఉపయోగించుకొని ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఓటు హక్కుతో ప్రజాస్వామ్యాన్ని కాపాడవచ్చని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భూపాల్ రెడ్డి, రాజు, రాంబాబు, జైపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి, యాదిరెడ్డి, రమేష్ గుప్తా, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.