Leading News Portal in Telugu

L.B.Nagar Murder Case: ప్రేమోన్మాది కేసులో కీలక విషయాలు.. చిన్నప్పటి నుంచే వేధింపులు..!


క్లోజ్‌గా ఉండే స్నేహానికి సడన్‌గా ప్రేమ అని నామకరణం చేసేస్తారు. వద్దంటే చిరాకెత్తిపోతారు. ఎలా నచ్చజెప్పాలో తెలుసుకునే లోపే కత్తులతో రక్తం కళ్ల చూపిస్తారు. ఇదే నేటి తరం ముద్దుగా చెప్పుకుంటున్న రెండక్షరాల ప్రేమ. ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అచ్చంగా అదే జరిగింది. ఫలితంగా ఏ పాపం ఎరుగని ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. ప్రేమను దక్కించుకుందామనుకున్న అతగాడు ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడు. ఒకనాటి ప్రేమ వేరు ఈ జనరేషన్‌ ప్రేమ వేరు. ఆనాటి ప్రేమలకు అందమైన బందాలు తోడయ్యేవి. ఈనాటి ప్రేమకు ఆకర్షణ, రొమాన్స్‌ తోడయ్యాయి. స్వచ్చమైన ప్రేమను దక్కించుకునేందుకు ఆనాడు దేవదాస్‌ అవతారాలు ఎత్తితే.. నేడు కత్తులతో బెదిరించి మరీ ప్రేమను పొందాలనుకుంటున్నారు. ఇప్పుడే కత్తులు చూపించి లొంగదీసుకోవాలని చూసే వాళ్లు నూరేళ్లు ప్రశాంతంగా ఎలా కలిసుండగలరు?. అలాంటి వయలెన్స్‌తో కూడిన ప్రేమ.. సంసార జీవితం వరకు ఎలా రాగలుగుతుంది?. ఇవన్నీ డోంట్‌కేర్‌.. మేము కోరుకున్న దాని కోసం సొంత అక్క అయినా, అన్న అయినా, ఎవరైనా సరే.. అడ్డొస్తే అడ్డంగా నరికేయడమే ఈ సరికొత్త ప్రేమకు నేటి లవర్స్‌ చేసిన నిర్వచనం. తన ప్రేమను కాదన్న కోపంతో ఓ ప్రేమోన్మాది అమ్మాయి తమ్ముడిని కత్తితో పొడిచి చంపేసాడు. అడ్డొచ్చిన అమ్మాయికీ కత్తి గాయాలు అయ్యాయి.

Singireddy Niranjan Reddy : ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం 10,000 ఎకరాలు

శివకుమార్‌, పృథ్వీ, సంఘవి ముగ్గురూ షాద్‌నగర్‌లో కలిసి చదువుకున్నారు. చిన్నప్పటి నుండి క్లాస్‌మేట్స్‌ కావడంతో ముగ్గురూ చాలా క్లోజ్‌గా ఉండేవారు. ఆ క్లోజ్‌నెస్‌కు లవ్‌ అని పేరు పెట్టేసిన శివకుమార్‌.. సంఘవికి తన మనసులోని మాట చెప్పాడు. చిన్ననాటి స్నేహితులం కదా అని చనువిస్తే.. ఇదేం పద్దతి అంటూ పృథ్వి, సంఘవి శివకుమార్‌కు వార్నింగ్‌ ఇచ్చారు. అయినా ఎలాగైనా సంఘవిని దక్కించుకోవాలనుకున్న నిందితుడు.. తరుచూ ఆమెను వెంబడించే వాడు. ఇతగాడి వేదింపులు తట్టుకోలేక అక్క, తమ్ముడు ఇద్దరూ తామెక్కడ ఉంటున్నామన్నది కూడా శివకుమార్‌కు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అయినా శివకుమార్‌ వారి అడ్రస్‌ పట్టేసాడు. కొద్ది రోజులుగా ఫోన్‌లో తనను ఆవాయిడ్‌ చేస్తున్న సంఘవి ఉంటున్న రూమ్‌కు తన సోదరితో కలిసి వెళ్లిన శివకుమార్‌.. పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. ఆమె అంగీకరించక పోగా పృథ్వీ శివకుమార్‌ సోదరికి నచ్చజెప్పి పంపించేసాడు. తాను ప్రేమంచిన అమ్మాయి ఇక తనకు ఎప్పటికీ దక్కదనుకున్న అతగాడు.. ఎల్‌బీనగర్‌ ఆర్‌టీసీ కాలనీలో ఉన్న సంఘవి రూమ్‌కు మరోసారి వెళ్లాడు. సంఘవిని కత్తితో బెదిరిస్తుండగానే మరో గదిలో ఉన్న పృథ్వీ పరుగున వచ్చి అక్కను కాపాడుకునే ప్రయత్నం చేసాడు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న శివకుమార్‌.. తన చేతిలోని కత్తితో పృథ్వీ చాతీపై పొడిచాడు. భయంతో బయటకు పరుగులు తీసిన పృథ్వీ తన అక్కను కాపాడాలంటూ అరిచి కుప్పకూలిపోయాడు.

Ustad Bhagat Singh: కత్తులతో ఉస్తాద్ డైరెక్టర్.. మనల్ని ఎవడ్రా ఆపేది?

భయంతో వణికిపోతున్న సంఘవిని ఇంటిపక్కనే ఉన్న ఝాన్సీ అనే మహిళ వచ్చి కాపాడింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే వారిద్దరిని హాస్పిటల్‌కు తరలించే లోపే పృథ్వీ ప్రాణాలు కోల్పోయాడు. సంఘవిని ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తన సోదరిపై దాడి చేసి తమ్ముడి ప్రాణాలు తీసిన శివకుమార్‌ను కఠినంగా శిక్షించాలని మరో సోదరుడు డిమాండ్‌ చేసాడు. మా అన్నను హాస్పిటల్‌కు తరలించకుండా స్థానికులు వీడియోలు తీస్తూ నిల్చున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు. మరోవైపు శివకుమార్‌ గత నేరచరిత్రపై పోలీసులు ఆరా తీయాలని డిమాండ్‌ చేసాడు. గతంలో సొంత తండ్రిని సైతం చంపినట్టు అనుమానాలున్నాయన్నారు. నిందితుడు శివకుమార్‌ను ఆదివారం అర్దరాత్రి స్పాట్‌కు తీసుకెళ్లి సీన్‌రీకన్స్ట్రక్షన్‌ చేసారు. దాడి జరిగిన ప్లేస్‌లో నిందితుడి నుంచి వివరాలు సేకరించారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని నిజాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు.