ఎండీఎంఏ డ్రగ్ అత్యంత ప్రమాదకరమైంది అని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవిస్ అన్నారు. ఎండీఎంఏ మత్తు మందును తీసుకుంటే 24 గంటలు పాటు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.. అంతేకాదు ఇటీవల కాలంలో మెట్రో నగరాలు ఈ డ్రగ్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది అని ఆయన వ్యాఖ్యనించారు. పబ్ కల్చర్ పెరిగిన తర్వాత ఎండీఎంఏ డ్రగ్ వాడకం పెరిగిపోయింది.. ఈ డ్రగ్ ను ఒకసారి తీసుకుంటే 24 గంటల పాటు మనం స్పృహ లేకుండా పోతామని పేర్కొన్నారు. ముఖ్యంగా అమ్మాయిలకు తెలియకుండా ఈ డ్రగ్ ను ఇచ్చి వాళ్లపైన అబ్బాయిలు అగైత్యాలకు పాల్పడుతున్నారు.. మెట్రో నగరాల్లో ఇలాంటి దారుణాలు విపరీతంగా పెరిగిపోయాయని డీసీపీ డెవిస్ తెలిపారు.
తాజాగా హైదరాబాద్ లో మరొక భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చిందని డీసీపీ జోయల్ డెవిస్ పేర్కొన్నారు. సెక్స్ వర్కర్ ఎండీఎంఏ డ్రగ్స్ వాడుతున్నట్లుగా బయటపడింది. ఈ డ్రగ్ నీ సెక్స్ వర్కర్లకు తెలియకుండా వాడుతున్నట్లుగా వెలుగులోకి వచ్చింది.. మాదాపూర్ లో దొరికిన డ్రగ్స్ రాకెట్ కి దీంతో లింకులు ఉన్నట్టు డీసీపీ చెప్పారు. మాదాపూర్ లో వారం క్రితం డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తూ సినీ ఫైనాన్స్ తో పాటు కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దానిపై విచారణంగా చేస్తుండగా ఎండీఎంఏ డ్రగ్ పెద్ద మొత్తంలో వినియోగించినట్లు బయటపడింది.. ఈ డ్రగ్ ను రాజస్థాన్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి సెక్స్ వర్కర్లకు వాడుతున్నారు.. సెక్స్ వర్కర్లకు తెలియకుండా దీనిని వాడుతున్నట్లు డీసీపీ జోయల్ డెవిస్ వెల్లడించారు.
రాజస్థాన్ కు చెందిన హోంగార్డు ప్రతాప్ సింగ్ హైదరాబాద్ లోని వీరేందర్ తో పరిచయాలు ఉన్నాయి. ఈ పరిచయాల నేపథ్యంలో రాజస్థాన్ లో దొరికే ఎండిఎంఏ హైదరాబాద్ కు తీసుకు వచ్చి హైదరాబాద్, సైబరాబాద్ ప్రాంతంలో ఉన్న వ్యభిచార ముఠాలకు విక్రయిస్తున్నారు అని వెస్ట్ జోన్ డీసీపీ వెల్లడించారు. పెద్ద మొత్తంలో వ్యభిచారం ముఠాలు ఈ ఎండీఎంఏ డ్రగ్ కొనుగోలు చేస్తున్నాట్లు గుర్తించాం.. ఉపాధి కోసం హైదరాబాద్ కు అమ్మాయిలను తీసుకువచ్చి వారిని బలవంతంగా సెక్స్ వర్కర్లుగా మారుస్తున్నట్లు తెలిసిందని ఆయన చెప్పారు. అలాంటి ముఠాలే ఎక్కువగా ఎండీఎంఏ డ్రగ్ ను అమ్మాయిల ఉపయోగిస్తున్నారని తెలిపారు.
ప్రతాప్, వీరేందర్లు కలిసి ఈ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా టాస్క్ ఫోర్స్ అధికారులకు సమాచారం వచ్చింది అని డీసీపీ జోయల్ డెవిస్ చెప్పుకొచ్చారు. టాస్క్ ఫోర్స్ సమాచారంతో వెస్ట్ తో జూబ్లీహిల్స్ పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.. ఇద్దరు దగ్గర నుంచి దాదాపు 210 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ డ్రగ్ ఇప్పటి వరకు ఎవరెవరికి సప్లై చేశారు.. ఎంతమందికి సప్లై చేస్తున్నారనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు.