హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ లో పని చేస్తున్న హోంగార్డు రవీందర్ ఆత్మహత్యయత్నాం సంచలనంగా మారింది. జీతం ఇవ్వకపోవడంతో బ్యాంకుకు చెల్లించాల్సిన ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైందని మనస్థాపానికి గురయ్యాడు. అనంతరం హోంగార్డు అధికారుల ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అయితే, హోంగార్డు ఆరోగ్యం విషమంగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. అయితే, హోంగార్డు రవీందర్ పరిస్థితిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రవీందర్ ను కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాస్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వాళ్ళ కనీస హక్కులు ఇవ్వకుండా.. హోంగార్డ్ వ్యవస్థను ప్రభుత్వం అవమాన పరుస్తోంది అని ఆయన చెప్పుకొచ్చారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హోంగార్డ్ ల సమస్యలపై చాలా సార్లు మాట్లాడిన.. సీఎం చాలా సార్లు వాళ్ళను పర్మినెంట్ చేస్తాము అని చెప్పారు.. హోంగార్డ్ లు 16 గంటలకు పైగా పని చేస్తున్నారు.. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.
హోంగార్డులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. వాళ్ళ ఆరోగ్యానికి భద్రత ఇవ్వాలి.. హోంగార్డ్ లకు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలి.. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటన చూడండి అంటూ వీడియో ప్లే చేసిన కిషన్ రెడ్డి.. ఐదున్నర సంవత్సరాలు గడిచినా.. సీఎం వాళ్ళ సమస్యలు పరిష్కరించలేదు అని ఆయన మండిపడ్డారు. హోంగార్డులకు కేసీఆర్ ప్రభుత్వం సకాలంలో జీతాలు ఇవ్వట్లేదు అని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం రాగానే.. హోంగార్డ్ ల అన్ని సమస్యలు పరిష్కరిస్తాము అని ఆయన హామీ ఇచ్చారు.