Leading News Portal in Telugu

BJP MP Laxman: సనాతన ధర్మం మీద చేస్తున్న దాడులు మంచిది కాదు..


నా కంటే పెద్ద హిందూ ఎవ్వడు లేడనే కేసీఆర్ కి ఈరోజు సనాతన ధర్మం మీద చేస్తున్న దాడులు కనపడట్లేవా అంటూ బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ తీవ్రంగా మండి పడ్డారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఆర్ కె పురం లో జరిగిన మేర మిట్టి మేర దేశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక ఇంటి నుంచి పిడికెడు మట్టి లేదా పిడికెడు బియ్యం ను సేకరించి ఢిల్లీలోని అమృత్ వనంలో మొక్కలు నాటే కార్యక్రమంలో వినియోగించి స్వతంత్ర సమరయోధులకు ఘన నివాళులు అర్పించనున్నామన్నారు.

ప్రపంచ దేశాలు మన భారత దేశ సంస్కృతి సంప్రదాయాలను కొనియాడుతుంటే, కొంతమంది కుహునా వాదులు మన సనాతన ధర్మం మీద విషం చిమ్ముతున్నారని అని బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. అటువంటి వారికి ఓటు అనే బ్రహ్మాస్త్రంతో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని డాక్టర్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు.

తెలంగాణ సమాజం బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్ధపడుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ప్రధాని మోడీ అధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సర్వ నాశనం అయిపోయిందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ లేదు అని లక్ష్మణ్ అన్నారు.