నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో జమిలి ఎన్నికలు ఉండబోవని… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని స్పష్టంచేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగకపోవచ్చని చెప్పారు. ఈ విషయంలో చాలామంది నేతలు భ్రమపడుతున్నారని, అలాంటిదేమీ ఉండకపోవచ్చని వారు నేతలకు వివరించారు. అయితే.. ఈ నెల 26 నుండి బీజేపీ యాత్రలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మూడు చోట్ల నుండి ఈ యాత్రలు ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు. అయితే.., తెలంగాణను మూడు జోన్లుగా విభజించింది బీజేపీ. జోన్ 1 కొమరం భీమ్ కాగా.. ఈ జోన్ లో అదిలాబాద్ నిజామాబాద్ మెదక్, బాసర నుండి ప్రారంభం అవుతుంది. అలాగే.. రెండో జోన్ గా కృష్ణ మహబూబ్‌గర్, నల్గొండ జిల్లాలు, సోమశిల నుండి యాత్ర ప్రారంభం కానుంది. వీటితో పాటు.. మూడవ జోన్ గా గోదావరి.. ఉమ్మడి ఖమ్మం వరంగల్ కరీంనగర్ జిల్లాలు ఉండగా.. భద్రాచలం నుండి యాత్ర ప్రారంభం కానుంది. హైదరాబాదు లో యాత్ర ముగింపు కానుండగా.. ఈ ముగింపు సభకు మోడీ హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
మొత్తం 19 రోజులు… 4, వేల కిలమీటర్లు… అక్టోబర్ 14 న గోషామహల్ నియోజక వర్గం లో యాత్ర ముగియనుంది. యాత్రల్లో 26 ఒక యాత్ర, 27 ఒక యాత్ర , 28 యాత్ర.. సెప్టెంబర్ 15 న పరకాలలో బహిరంగ సభ.. ఉస్మానియా యూనివర్సిటీ నుండి పరకాల వరకు బైక్ ర్యాలీ.. పెరేడ్ గ్రౌండ్ లో సెప్టెంబర్ 17 న బహిరంగ సభ.. ముగ్గురు సీఎం లకు ఆహ్వానం… సెప్టెంబర్ 17 విశ్వకర్మ పథకం వరంగల్ లో లాంచింగ్.. ఈ నెల 15,16 తేదీల్లో అన్ని మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు.. సెప్టెంబర్ 17 న అధికారిక కార్యక్రమం తో పాటు, బీజేపీ బహిరంగ సభ రెండు వేర్వేరు.. రెండు కార్యక్రమాలు పెరేడ్ గ్రౌండ్ లోనే.. 9 గంటలకు అధికారిక కార్యక్రమం.. 11 గంటలకు బహిరంగ సభ.. సెప్టెంబర్ 20 నుండి 23 వరకు 450 మందిని సెలక్ట్ చేసి… మండలాల వారీగా పర్యటన… తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 15 న ఉస్మానియా యూనివర్సిటీ నుండి పరకాల వరకు కిషన్ రెడ్డి బైక్ ర్యాలీ, పరకాలలో బహిరంగ సభ’ ఉంటుందని కిషన్ రెడ్డి వివరించారు.
సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ జెండాను ఎగురవేసి, పారా మిలటరీ బలగాల కవాతులో గౌరవ వందనం స్వీకరించి, తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో వరుసగా రెండో సంవత్సరం కూడా పాల్గొంటారు. శుక్రవారం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన టీఎస్‌బీజేపీ పదాధికారుల సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారు. అన్ని పోలింగ్ బూత్‌లు, పార్టీ కార్యాలయాల్లో కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. అదే రోజున, పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా, మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో రక్తదానం మరియు ఆరోగ్య శిబిరాలతో కూడిన హోర్డింగ్‌లను ఏర్పాటు చేస్తుంది.