Leading News Portal in Telugu

Koppula Eshwar : కేసీఆర్ హయాంలో తెలంగాణ ఒక బొమ్మరిల్లులా అయింది


పెద్దపెళ్లి జిల్లా ధర్మారం మండలం తండాబి గ్రామంలో బీఆర్‌ఎస్‌ పార్టీ చేరికలు కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో తెలంగాణ ఒక బొమ్మరిల్లు లా అయిందని ఆయన వ్యాఖ్యానించారు.గత కాంగ్రెస్ హయాంలో కరెంటు,వ్యవసాయం, పిల్లలకు చదువులు లేవని, ఎండిపోయిన తెలంగాణ ను పచ్చగా చేసిన ఘనత సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు. మూడు గంటల కరెంటు ఇచ్చే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల లేదా బి అర్ ఎస్ పార్టీకి వేయాల ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు కొప్పుల ఈశ్వర్‌. మంచి ప్రభుత్వం ఉండే పార్టీలో చేరాలని, సాయంత్రం కు వచ్చే వారి మాటలు విని మోసపోవద్దన్నారు కొప్పుల ఈశ్వర్. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మల్లి గెలిపించి మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు కొప్పుల ఈశ్వర్‌.

ఆరు గంటలపాటు కరెంట్‌ ఇస్తానన్న కాంగ్రెస్‌, ఏనాడైనా మూడుగంటల పాటైనా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. నాడు నాట్లు వేసే కాలం వచ్చిందంటే ఎరువుల దుకాణాల ముందు చెప్పుల వరుసలు, విత్తనాల దుకాణాల ముందు క్యూలైన్లు ఉండేవని గుర్తుచేశారు. 2014 తర్వాత సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయతో చెరువులను బాగుచేస్తూనే, మరోవైపు రైతుబంధు వంటి విప్లవాత్మక పథకాలు అమలుచేశారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తేనే రైతాంగం బాగుపడుతుందని అన్నారు. రైతాంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి అండగా నిలువాలని మంత్రి పిలుపునిచ్చారు.