కేసీఆర్ కంటే పెద్ద దగా కొరు పార్టీ కాంగ్రెస్ అని విమర్శలు గుప్పించారు బీజేపి జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెరేడ్ గ్రౌండ్ కోసం కాంగ్రెస్ అప్లికేషన్ పెట్ట లేదని, పరేడ్ గ్రౌండ్ కోసం కాంగ్రెస్ రాసిన లెటర్ ఉంటే బయట పెట్టాలన్నారు ఇంద్రసేనారెడ్డి, నీకు ( రేవంత్) కవిత కి ఉన్న సంబంధం ఏంటో బయటపెట్టాలని, ఓటు కు నోట్ కేసులో రేవంత్ బయటికి వచ్చిన తర్వాత కేసు ఏమైంది? అని ఆయన ప్రశ్నించారు. మీకు బీఅర్ఎస్ తో బిజినెస్ సంబంధాలు లేవా? కేసిఆర్ తో పొత్తు పెట్టుకొని వాళ్ళతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ కాదా? అని ఆయన ఇంద్రసేనా రెడ్డి అన్నారు.
అంతేకాకుండా.. ‘ఎవరికీ ఎవరితో సంబంధాలు ఉన్నాయి అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఎన్నికల తర్వాత బీ అర్ ఎస్ కాంగ్రెస్ లు కలుస్తాయి. కలుస్తారు అని చెప్పడానికి గతంలో జరిగిన ఎన్నికలే ఉదాహరణ. బీజేపీ అభ్యర్థుల అప్లికేషన్ తేదీ పొడిగింపు పై ఎటువంటి చర్చ జరగలేదు. కిసాన్ సర్కార్ అంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది సరిపోక దేశ వ్యాప్తంగా మోసానికి బయల్దేరారు కేసీఆర్. కేంద్రం ఇచ్చే ఎరువుల సబ్సిడీ అందకుండా చేస్తున్న దుష్టుడు కేసీఆర్. కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం చెప్పులు లైన్ లో పెట్టి సొమ్మసిల్లిన రైతులు. అన్ని రకాలుగా రైతులను ఆదుకుంటున్న మోడీ. ఎరువుల మీద ఇచ్చే సబ్సిడీ నీ బస్త మీద ముద్రిస్తున్నరు. ఈ విషయం రైతులకు తెలియకూడదు అని ప్రయత్నం చేస్తున్న బీ అర్ ఎస్ ప్రభుత్వం.
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. గతంలో ఎరువుల కొరత ఉండేది. కానీ నేడు అలాంటి పరిస్థితి లేదు. మూత పడ్డ 5ఎరువుల కర్మాగారాలను రీ ఓపెన్ చేసిన మోడీ. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేయమని డిమాండ్ చేసి అధికారంలోకి వచ్చాక దాన్ని మర్చిపోయారు. రైతులకు ఎరువులన్ని ఫ్రీ గా ఇస్తామని కేసిఆర్ చెప్పిన విడియో ను ప్లే చేసి చూపించిన నల్లు ఇంద్రసేనారెడ్డి. చేతగాని తనం తోనే కేంద్రం ఇచ్చే ఎరువులను రైతులకు ఇవ్వని కేసీఆర్. కేసీఆర్ కి రాజకీయం తప్ప ఏమీ ఇంకేమి చేతకాదు. మార్క్ ఫెడ్ లో ఉన్న ఎరువులను 24 గంటల్లో రైతులకు ఇవ్వాలి. లేదంటే రైతులకు నేరుగా మేమే వాటిని పంచుతం. రాజకీయం ఉంటే పార్టీల తరపున కొట్లడదం. రైతులతో చెలగాటం వద్దు.’ అని ఇంద్రసేనా రెడ్డి వ్యాఖ్యానించారు.