Leading News Portal in Telugu

NIMS : నవజాత శిశువులకు మరియు పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషనలు


వైద్యో నారాయణో హరీ అంటారు.. దీని అర్ధం వైద్యుడు దేవునితో సమానం.. ఎందుకంటే జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే.. పునర్జన్మ నిచ్చేది వైద్యులు.. అందుకే డాక్టర్ ని దేవునితో సమానంగా చూస్తారు.. ఒకప్పుడు మనిషి వంద సంవత్సరాలు పైబడి బ్రతికే వారు అని మన అమ్మమ్మ తాతయ్యలు చెప్తుంటారు.. కానీ నేడు మనిషి సగటు జీవిత ప్రమాణాలు 60 సంవత్సరాలకి పడిపోయింది.. వయసుతో సంభంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అనారోగ్యంతో బాధపడుతున్నారు..

ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు ప్రస్తుతం ప్రజలని పట్టి పీడిస్తున్నాయి.. నవజాత శిశువుల నుండి వృద్దుల వరకు చాలా మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.. కాగా ప్రస్తుతం గుండె జబ్బుతో బాధపడుతున్న నవజాత శిశువులకి, పిల్లలకి శుభవార్త చెప్పారు నిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్..

హైదరాబాద్‌ లోని నిమ్స్ హాస్పిటల్ ‘హీలింగ్ లిటిల్ హార్ట్స్ చార్లీస్ హార్ట్ హీరోస్ క్యాంప్’ కార్యక్రమం నిర్వహిస్తుంది.. ఈ నేపథ్యంలో ‘హీలింగ్ లిటిల్ హార్ట్స్ చార్లీస్ హార్ట్ హీరోస్ క్యాంప్’ కార్యక్రమంలో భాగంగా నవజాత శిశువులకి.. 5 సంవత్సరాల లోపు పిల్లలకి నిమ్స్ లో ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తున్నట్లు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు..

ఈ తరుణంలో పిల్లలకు సస్త్ర చికిత్సలు చేసేందుకు UK సర్జన్లు విచ్చేయనున్నారు. సెప్టెంబరు 24-30 ( వారం రోజుల పాటు) తారీఖుల్లో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు గుండె శస్త్రచికిత్స శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.. ఎవరికైతే తక్షణ సస్త్ర చికిత్స అవసరమో ఆ పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిమ్స్ వైద్యులు కోరుతున్నారు.. మరింత సమాచారం కోసం 040-23489025 నెంబర్ కి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య సంప్రదిచండి.