సీడబ్ల్యూసీ సమావేశానికి ఆల్ ఇండియా సీఎల్పీ లీడర్స్ అతిరధ మహారథులు అందరూ ఈ సమావేశనికి వస్తారని తెలిపారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన ఖమ్మం కాంగ్రెస్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాదులో సీడబ్ల్యుసీ సమావేశం జరగడం నాయకులకు కార్యకర్తలకే కాకుండా ప్రజలకు కూడా ఇది ఒక అదృష్టమన్నారు భట్టి విక్రమార్క. ఈ సమావేశంలో చారిత్రాత్మకమైన విషయాలని ప్రకటిస్తారని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలకుగను ఐదు నియోజకవర్గాలకు ఒక ఇన్చార్జిని నియమిస్తారన్నారు భట్టి విక్రమార్క.
ఈరోజు నుంచి ఈనెల 15వ తేదీ వరకు ఆ నియోజకవర్గ నాయకుడితో కలిసి ఆనియోజకవర్గ వ్యాప్తంగా తిరిగి స్థితిగతులను అధిష్టానానికి అందజేస్తారని ఆయన తెలిపారు. 15, 16, 17 సీడబ్ల్యూసీ సమావేశాలు 17న బహిరంగ సభజరుగుతుందని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ బీజెపి రెండు పార్టీలు ఒకటేనని మరోసారి మండిపడ్డారు భట్టి విక్రమార్క. బీఅర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాధనాన్ని కాపాడుకోవడానికి ప్రజా ఆస్తులు అక్రమంగా అమ్ముతున్న బీజేపీని పక్కన పెట్టడానికే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచమే నివ్వరబోయేటట్టు రాహుల్ గాంధీ పై కేసు పెట్టడం పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చూడటం బీజేపీ పార్టీ చేసిన అతి పెద్ద తప్పు అని భట్టి విక్రమార్క ధ్మజమెత్తారు.