మేడ్చల్ జిల్లా ఔషాపూర్, ఘట్కేసర్‌లో జరిగిన బీజేపీ యువమోర్చ రాష్ట్ర స్థాయి సమావేశంలో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. యువమోర్చతో నాకు గొప్ప అవినాభావ సంబంధం ఉందన్నారు. జిల్లాస్థాయి నుంచి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉందని, యువమోర్చలో పనిచేసిన అనేకమంది నాయుకులు మంత్రులు కేంద్రమంత్రులు ముఖ్య మంత్రులు అయ్యారన్నారు.
రాజనాథ్ సింగ్, నుంచి మొదలుకొని శివరాజ్ సింగ్ చౌహన్ నాతో పాటు అనేకమందిని నాయకులుగా తీర్చిడిద్దింది యువమోర్చనే అని గర్వాంగా చెప్పగలనన్నారు కిషన్ రెడ్డి. రేపటి భవిషత్తు మీదే యువమోర్చదే అని చెప్పగలనని, తెలంగాణలో యువమోర్చ నాయకులు ప్రభుత్వ వైపాల్యాపై పోరాటం చేస్తుంది భవిష్యత్ లో మరింత కష్టపడాలి బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు పోరాటం చేయాలన్నారు కిషన్ రెడ్డి.
అంతేకాకుండా.. ‘ప్రభుత్వ తప్పిదాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజల్ని చైతన్య పరచాలి ఆ బాధ్యత యువమోర్చ తీసుకోవాలి. 1200 మంది ఆత్మబలిదానాలతో, అనేక మంది త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ కేసీఆర్ కబంధ హస్తాల్లో నలిగిపోతోంది. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. భూములమ్మితే గాని ప్రభుత్వం నడిచే పరిస్థితిలేదు. వైన్ షాపుల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటోంది. టీచర్ పోస్టులను భర్తీ చేయడం లేదు. గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయి.అప్పులుచేసి కోచింగులు తీసుకొని కష్టపడుతుంటే.. నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇయ్యకుండా వేధిస్తోంది.
ప్రతి నిరుద్యోగికి రూ. 3016 చొప్పున ఇస్తానని మాట తప్పారు. ఏడాది పొడవునా బెల్ట్ షాపులతో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారు. ఏకమొత్తంలో రుణమాఫీ చేయలేదు.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని మోసం చేశారు. గత తొమ్మిదేండ్లలో బీసీలను, రైతులను, విద్యార్థులకు అన్యాయం జరిగింది. కేవలం బాగుపడింది కేసీఆర్ కుటుంబ సభ్యులు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం కోసం.. కాంగ్రెస్ రాహుల్ గాంధీ కోసం పనిచేస్తాయి. భారతీయ జనతా పార్టీ దేశం కోసం పనిచేస్తుంది. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో బుద్ధిచెప్పి.. బిజెపి ని గెలిపించేందుకు సిద్ధమయ్యారు.’ అని కిషన్ రెడ్డి అన్నారు.