వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చెన్ గొముల్ లో ఆరోగ్య మహిళా కేంద్రాన్ని మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కొత్తగా అమలవుతున్న ఆరోగ్య మహిళ పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అన్నారు. మహిళల ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తూ మహిళా ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళ పథకం ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు. మార్చ్ 8 ప్రారంభం కావాల్సింది కానీ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తో జూన్ 14 న ప్రారంభించారని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 372 మహిళా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, వికారాబాద్ జిల్లాలో జూన్ 20న ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు దోమ, యాలాల్, రామయ్యగూడ కేంద్రాలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. నేడు కొత్తగాబంటారం, మోమిన్పేట, ధారూర్, కోటపల్లి, చెన్గోముల్ కేంద్రాలు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఆరోగ్య మహిళా కేంద్రాల్లో ప్రతీ మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తారని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన మహిళకు 4 విడతలుగా మగ శిశువుకు 12 వేలు, ఆడ శిశువుకు 13 వేలు అందజేయనున్నట్లు మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. 2800 విలువతో కేసీఆర్ కిట్ లో 16 రకాల వస్తువులు తల్లి, బిడ్డ సంరక్షణ కోసం ఇస్తున్నామని ఆయన అన్నారు. వికారాబాద్ జిల్లాలో కేసీఆర్ కిట్లు ఇప్పటి వరక 43 వేల 320 మంది బాలంతలకు అందించామని ఆయన అన్నారు.