Leading News Portal in Telugu

Minister KTR : ఎవరు పరిశ్రమ పెట్టినా కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ మారింది


హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సెంటారస్ లో ఇన్ స్పైర్ సంస్థ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ ఇన్నోవేషన్ సెంటర్ ఇన్ స్పైర్ సంస్థకు ఎంతో ప్రత్యేకం అని తెలియజేశారు నిర్వాహకులు. మల్టీ బ్రాండ్ రెస్టారెంట్ కంపెనీగా ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉన్న ఇన్ స్పైర్.. హైదరాబాద్ లో తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ తో విస్తరణ ప్రణాళికలు రచిస్తోంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి.. అవి ఎన్నికప్పుడు చేసుకోవచ్చన్నారు.. పరిశ్రమలు వచ్చినప్పుడు అందరూ సహకరించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు సింగిల్ విండో తీసుకువచ్చిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టె పరిశ్రమలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. స్థానిక యువతకు ఉద్యోగం కల్పించడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభిస్తుందన్నారు మంత్రి కేటీఆర్‌. స్థానిక ప్రజాప్రతినిధులు మీ ప్రాంతాల్లో పరిశ్రమ వస్తే సహకరించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. కొంతమంది రాజకీయాలు చేస్తారు.. నిజా నిజాలు తెలుసుకోవాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎవరు పరిశ్రమ పెట్టినా కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ మారిందన్న మంత్రి కేటీఆర్‌.. భారతదేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని ఆయన అన్నారు. తెలంగాణలో 5 రకాల విప్లవాలు ఆవిష్కృతమవుతున్నాయని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.