Leading News Portal in Telugu

DK Aruna : శాంతి యుతంగా దీక్ష చేస్తే మీకు వచ్చే నష్టం ఏంది


తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌ ఇందిరా పార్కులోని ధర్నాచౌక్‌ వద్ద 24 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కిషన్‌ రెడ్డికి మద్దతుగా తరలివచ్చిన ఇతర బీజేపీ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిషన్‌ రెడ్డి అరెస్ట్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇందిరా పార్కు వద్ద చేస్తున్న దీక్ష ను భగ్నం చేసిన పోలీసులు తీరును ఖండిస్తున్నామన్నారు.

అనుమతి తీసుకొని దీక్ష చేస్తున్న పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటని ఆమె ధ్వజమెత్తారు. మహిళ కార్యకర్తలను ఇష్టారాజ్యాంగ పోలీసులు ఈడ్చుకెళ్ళడం దుర్మార్గమైన చర్యగా ఆమె అభివర్ణించారు. కేంద్ర మంత్రితో పోలీసులు వ్యవహరించిన తీరు ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. అకస్మాత్తుగా పోలీస్ లు వచ్చి దీక్ష కు భగ్నం చేశారని, ఎందుకు భగ్నం చేశారు.. ఉపవాసం ఉంది కిషన్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు అని.. కేసీఆర్ మిమ్మల్ని ఉపవాసం ఉండాలని అడగడం లేదు కదా అని ఆమె అన్నారు. శాంతి యుతంగా దీక్ష చేస్తే మీకు వచ్చే నష్టం ఏంది అని ఆమె ప్రశ్నించారు. కేంద్ర మంత్రి అని కనీస మర్యాద లేకుండా ప్రవర్తించారని ఆమె మండిపడ్డారు. అరెస్ట్ చేసిన తీరు అవమానకరంగా ఉందని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కిషన్ రెడ్డి తో మాట్లాడారన్నారు.