Leading News Portal in Telugu

School Holidays: 2 రోజుల పాటు స్కూళ్లకు సెలవు.. వారికి మాత్రమే..


School Holidays: ఈ మధ్య వర్షాలు వచ్చినప్పుడు.. పండుగలు ఇలా విద్యా సంస్థలకు భాగానే సెలవులు వచ్చాయి.. మరో సారి తెలంగాణలో రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు వచ్చాయి.. రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు డిసైడ్‌ చేసింది ప్రభుత్వం.. ఇంతకీ విషయం ఏంటంటే.. తెలంగాణ వరుసగా వివిధ పోస్టులకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్న విషయం విదితమే కాగా.. త్వరలోనే టీఎస్‌ టెట్‌ (TS TET) కూడా జరగనుంది.. ఇప్పటికే ఆన్‌లైన్‌లో హాల్‌ టికెట్లను ఉంచారు అధికారులు.. చాలా మంది అభ్యర్థులు హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.. ఈ నెల 15న టెట్‌ నిర్వహించనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా టెట్‌ కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది..

రెండు పేపర్లుగా అంటే పేపర్‌ -1, పేపర్‌ -2గా టెట్‌ నిర్వహించబోతున్నారు.. ఈ నెల 15వ తేదీన జరగనున్న టెట్‌లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. టెట్‌ నేపథ్యంలో.. ఎగ్జామ్‌ సెంటర్స్‌ పడిన స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.. టెట్‌ సెంటర్లలో 14వ తేదీన హాఫ్‌ డే స్కూల్‌ మాత్రమే నిర్వహించనున్నారు.. ఇక, పరీక్ష జరిగే 15వ తేదీన ఆయా స్కూళ్లకు విద్యాశాఖ సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గత ఏడాది టెట్‌ నిర్వహించిన విద్యాశాఖ.. టీఎస్‌ టెట్‌-2023 నోటిఫికేషన్‌ ఆగస్టులో విడుదల చేసింది.. ఆగస్టు 2 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ జరిగింది.. 2.83 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, టెట్‌లో అర్హత సాధించినవారికే డీఎస్సీ, గురుకుల లాంటి వివిధ ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించిన పరీక్షలకు అర్హులు కావడంతో.. తమ అదృష్ట్యాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు ఫ్యూచర్‌ పంతుల్లు. ఇక, ఈ ఏడాది పేపర్-1కి 1,139 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్-2 పరీక్ష కోసం 913 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో అత్యధికంగా 92 పరీక్షా కేంద్రాలు, ములుగు జిల్లాలో అత్యల్పంగా 8 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఈసారి కూడా టెట్ సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదు. పరీక్షలో భాగంగా రెండు పేపర్లు ఉంటాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ల నియామకం కోసం పేపర్-1 నిర్వహిస్తారు మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత సాధించేందుకు పేపర్-2 నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు ఉంటాయి. పేపర్-1 పరీక్షలో 1-8 తరగతులకు ప్రామాణిక ప్రశ్నలు మరియు పేపర్-2 పరీక్షలో 6-10 తరగతులకు ప్రామాణిక ప్రశ్నలు ఉంటాయి.