Unexpected: కుటుంబంలోని చెల్లికో, అక్కకో పరిమితం కాకుండా ఆపదలో ఉన్న ప్రతి ఆడపిల్లకూ అన్నగా తోడు ఉండాలి. చెల్లికి అమ్మా, నాన్నలా చూసుకునే ఓ అన్న ఉంటే తన జీవితం ధన్యమే అని చెప్పాలి. ప్రతి కష్టం లోను ఇష్టం లోను తనకు తోడుగా ఉండి ప్రతి కణం తనకు కంటికి రెప్పలా కాపాడుతూ ధైర్యం చెబుతూ ముందుకు నడిపించే అన్నయ్య ఉంటే చెల్లికి రకణ కవచమే. ఆప్యాయతతో కూడిన ఆప్యాయతలు తోబుట్టువుల అనుబంధాన్ని సూచిస్తాయి. చెల్లెలికి ఏదైనా జరిగితే.. ఏ తమ్ముడూ భరించలేడు. అన్నకు జరిగినా.. చెల్లెలి హృదయం తట్టుకోలేకపోయింది. ఏ కష్టం వచ్చినా నేనున్నాను అనే ఆ అన్నయ్యే లేకపోతే ఆ చల్లి తన జీవితం కూడా లేదనుకుంది. అన్న మరణ వార్తను తట్టుకోలేని ఓ సోదరి గంట వ్యవధిలోనే కన్నుమూసింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కోర్టుల్లోనూ అదే జరిగింది.
Read also: AP High Court: చంద్రబాబు, నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్లు.. నేడు హైకోర్టులో విచారణ
నిజామాబాద్ జిల్లా మోసరకు చెందిన వరవ పోసాలు(65) అనే వ్యక్తి కుటుంబంతో సహా కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం కల్లూరు గ్రామానికి 10 ఏళ్ల క్రితం వలస వచ్చాడు. ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే పోసాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో మంగళవారం (సెప్టెంబర్ 12) రాత్రి మృతి చెందాడు. అన్న మృతిని తట్టుకోలేని అతని సోదరి పోశవ్వ(50) గుండెలవిసేలా రోదించింది. అన్న లేని జీవితం తనకు వద్దనుకుంది. చిన్నప్పటి నుంచి తోడు నీడగా ఉండే అన్న తీవ్ర అనారోగ్యంతో తన కళ్లముందే చనిపోవడంతో తీవ్ర సోకానికి గురైంది. ఆమె కూడా గంట వ్యవధిలో ఏడుస్తూ మరణించింది. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. అన్నదమ్ముల బంధాన్ని పసిగట్టిన గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు.
Vijay Deverakonda: అన్నీ సెంటర్స్ లో అదిరిపోయిన కలెక్షన్స్… తెలుగులో మాత్రం తుస్సుమంది