Kishan Reddy Deeksha: కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో ఉద్రిక్తత కొనసాగతుంది. ఇందిరాపార్క్ దగ్గర దీక్షను భగ్నం చేయడంతో బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డితోపాటు పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధర్నా చౌక్ నుంచి కిషన్‌రెడ్డిని తరలించేందుకు ప్రయత్నించగా.. బీజేపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి వదిలిపెట్టారు. అయినా కూడా కిషన్ రెడ్డి తన పార్టీ కార్యాలయంలో దీక్ష ప్రారంభించారు. రాత్రి నుంచి కార్యాలయంలోనే పార్టీ నేతలతో కలిసి ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటల వరకు కిషన్ రెడ్డి దీక్ష కొనసాగనుంది. 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశారని ఆరోపిస్తూ నిన్న కిషన్ రెడ్డి ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద 24 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు.
Read also: MLA Seetakka: ములుగు నుండే పోటీ చేస్తా.. రాబోయేది కాంగ్రెస్ పార్టీ సంక్షేమ రాజ్యం..
అయితే బుధవారం సాయంత్రం 6 గంటల వరకు దీక్షకు అనుమతి ఉన్నందని.. వెంటనే దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయాలని పోలీసులు కిషన్ రెడ్డికి సూచించారు. ఇవాళ ఉదయం 6 గంటల వరకు దీక్ష చేస్తానని పోలీసులకు తెలిపారు. పోలీసులు ససేమిరా అన్నారు. దీంతో పోలీసులు రాత్రి 8 గంటలకు ఆయన దీక్షను భగ్నం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్‌లో పరామర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు. పోరాటానికి కేంద్ర పార్టీ నుంచి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేయడంపై ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే భగ్నం చేస్తారా అని ప్రశ్నించారు.
నిరుద్యోగులపై సీఎం కేసీఆర్ చేస్తున్న మోసాలను ప్రభుత్వం మరుగున పడేసేలా దీక్షలు చేస్తుంటే సహించేది లేదన్నారు. పాట పాడే సమయానికి రజాకార్ల పాలన అంతమైందన్నారు. ప్రభుత్వ తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. అకస్మాత్తుగా పోలీస్ లు వచ్చి దీక్ష కు భగ్నం చేశారని మండిపడ్డారు. ఎందుకు భగ్నం చేశారు? అని ప్రశ్నించారు. ఉపవాసం ఉంది కిషన్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు.. కేసీఆర్ మిమ్మల్ని ఉపవాసం ఉండాలని అడగడం లేదు కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి యుతంగా దీక్ష చేస్తే మీకు వచ్చే నష్టం ఏంది అని మండిపడ్డారు. కేంద్ర మంత్రి అని కనీస మర్యాద లేకుండా ప్రవర్తించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన తీరు అవమానకరంగా ఉందన్నారు. నేడు జిల్లా, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
Ramabanam : ఓటీటీ లోకి వచ్చేసిన రామబాణం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?