Leading News Portal in Telugu

Minister Srinivas Goud: ఈడీ బోడీలకు భయపడేదేలే.. కవితకు ఏం జరిగినా దేశం అగ్నిగుండమే


ఈడీ బోడిలకు భయపడేది లేదు అని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఏం జరిగినా దేశం అగ్నిగుండమేనంటూ ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ని రాజకీయంగా తట్టుకోలేకే ఈ డ్రామాలు.. మహిళా బిల్లు కోసం దేశం అంత మద్దతు కోసం కవిత లేఖలు రాస్తే చూడలేకే.. ఈడీ ఈ నోటీసులు ఇచ్చింది.. లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళను వదిలి 100 కోట్ల రూపాయలు అంటూ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు.. ప్రాణాలకే తెగించిన వాళ్ళం గోరు దెబ్బలకు భయపడమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

దేశంలో మహిళల కోసం కవిత మహిళ బిల్లు కోసం పోరాటం చేస్తున్నారు.. స్కామ్ లేని కేసు.. కేసీఆర్ ను ఇబ్బందుల పాలు చేయాలని చూస్తున్నారు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ ను డిస్ట్రబ్ చేయాలని చూస్తున్నారు.. లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళుని విదేశాలకు వెళ్తే పట్టుకోవడం లేదు.. మహిళ బిల్లు కోసం గొంతు విప్పినప్పుడు కవితని భయ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చుస్తుంది అని ఆయన విమర్శించారు. సీబీఐ, ఐటీ, ఈడీలతో బీఆర్ఎస్ ను భయపెట్టాలని బీజేపీ చూస్తుంది అని మంత్రి అన్నారు. కవిత ఒక శక్తి.. కేసీఆర్ కుటుంబం అంటే తెలంగాణ కుటుంబం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చావడానికి సిద్ధం అయ్యారు.. కవితకి ఏమి సంబంధం ఉంది అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి కేసులతో దేశంలో ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని అన్నారు.