Leading News Portal in Telugu

MLA Rekha Nayak: ప్రభుత్వంపై ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ విమర్శలు


తెలంగాణ ప్రభుత్వంపై ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ విమర్శలు గుప్పించారు. ఏసీడీపీ నిధులు ఆపారు.. అభివృద్ది ఆపడం ఏంటీ అంటూ ఆమె ప్రశ్నించారు. దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, రోడ్ల పనులు ఆపారు.. నిధులు రాకుండా నిలిపి వేశారు అని ఎమ్మెల్యే అడిగారు. నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాను.. పార్టీ మారలేదు.. ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అని రేఖానాయక్ తెలిపారు.

ప్రజలకు అభివృద్ది కావాలి.. నేను నిధులు అడిగితే కాంగ్రెస్ పార్టీ అంటున్నారు.. నేను పార్టీ మారలేదు రేఖా నాయక్ తెలిపారు. పార్టీ మారింది నా భర్త.. నేను కాదు అని ఆమె అన్నారు. కావాలనే తన అల్లుడు ఐపీఎస్ బదిలీపై స్పందిస్తూ ఖనాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కన్నీళ్లు పెట్టుకున్నారు. నాకు చేసిన అన్యాయం చాలదన్నట్లు నా బిడ్డకు అన్యాయం చేసారు అంటూ కార్యకర్తల దగ్గర బోరున రేఖా నాయక్ విలపించారు. నా భర్త కాంగ్రెస్ లోకి వెళ్లారు.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వారి తండ్రి సీపీఐ పార్టీలో పనిచేయడం లేదా అని ఆమె ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమంలో పని చేశాను.. నియోజకవర్గం కోసం పని చేశాను.. 9 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాను.. అభ్యర్థి కోసం అభివృద్దిని ఆపడం ఏంటీ అని ఖనాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అడిగారు. ఇది మంచి పద్దతి కాదు.. ఇలాంటి దొరణి ఏదైనా ఉంటే ప్రభుత్వం వెంటనే దాన్ని మార్చుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు.