Leading News Portal in Telugu

TET Exam 2023: ఒక పేపర్‌కు బదులు ఇంకో పేపర్.. 15 సెంటర్లలో ఇదే సీన్..!


TET Exam 2023: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెట్ పరీక్ష 2023లో పొరపాటు జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష ప్రశాంతంగా జరిగినా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అభ్యర్థులకు మండిపడ్డారు. అభ్యర్థులకు ఒక పేపర్ బదులు మరో పేపర్ ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 సెంటర్లలో అదే సీన్ రిపీట్ అయింది. మూడు కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు పేపర్లు చూడకుండానే అభ్యర్థులకు ఇచ్చారు. దాదాపు అరగంట పాటు పరీక్ష కూడా రాశారు. అప్పుడు నిద్ర నుండి లేచి తప్పు పేపర్ ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం ఆగమేఘాల మీద పరీక్షా కేంద్రాలకు పరుగులు తీశారు. ఓఎంఆర్ షీట్‌లోని దాదాపు 30 ప్రశ్నలకు అభ్యర్థులు అప్పటికే సమాధానాలు పెట్టారు.

దీంతో అప్పటి వరకు నిండుగా ఉన్న బుడగలను వైట్‌నర్‌తో రుద్దాలని అధికారులు ఉచిత సలహా ఇచ్చారు. వైట్ నర్ తో రుద్దితే చెల్లదని అభ్యర్థులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇక చేసేదేమీ లేదు.. అధికారులు చెప్పినట్లుగా అభ్యర్థులు వైట్నర్లతో రుద్దుకుని మళ్లీ పరీక్ష రాశారు. అయితే.. సాయంత్రం ఐదు గంటలకు ముగియాల్సిన పరీక్షను ఆయా కేంద్రాల్లో ఆరు గంటల వరకు పొడిగించారు. అయితే.. ఆందోళనలో.. అభ్యర్థులు ఏం రాస్తున్నారో కూడా తెలియకుండా పరీక్ష రాశారు. దీంతో అభ్యర్థులు అయోమయంలో పడ్డారు. తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థులు పరీక్షా కేంద్రం వద్ద బైఠాయించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ బతుకులు స్తంభించిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: CWC Meeting:రెండ్రోజుల పాటు సీడబ్ల్యూసీ సమావేశాలు.. హైదరాబాద్‌కు తరలిరానున్న కాంగ్రెస్ నేతలు

ఇక మరోవైపు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన టెట్ ఎగ్జామ్ లో విషాదం చోటుచేసుకుంది. సమయం కంటే ముందే హాజరు కావాలని 8నెలల నిండు గర్భణీ ఎగ్జామ్ రాసేందుకు పరుగెత్తుకుంటూ వచ్చి ఎగ్జామ్ హాల్లో కుప్పకూలిపోయింది. స్పందించిన సిబ్బంది ఆసుపత్రికి తరలించగా వైద్య పరీక్షలు నిర్వహించి అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. గచ్చిబౌలిలో అరుణ్, రాధిక నివాసం ఉంటున్నారు. రాధిక 8 నెలల గర్భవతి. రాధిక టెట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతుంది. అయితే ఇవాళ టెట్ ఎగ్జామ్ ఉండటంతో సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు మండలం ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు భర్త అరుణ్ తో కలిసి రాధిక వెళ్లింది. పరీక్షకు వెళ్లే తొందరలో తను ఎనిమిది నెలల గర్భవతి అనే సంగతి మరిచింది.

పరిగెత్తుకుంటు పరీక్షా గదికి చేరుకుంది. తన సీటులో కూర్చొంది ఇంతలోనే రాధికకు బీపీ ఎక్కువై, చెమటలొచ్చి పరీక్షా గదిలోనే రాధిక పడిపోయింది. అక్కడున్న విద్యార్థులందరూ భయాందోళనకు గురయ్యారు. రాధిక పడిపోవడం ఉపాధ్యాయులకు చెప్పడంతో రాధికపై నీళ్లు చెల్లిన ప్రయోజనం లేకుండా పోయింది. అక్కడే ఉన్న పోలీసులకు, యాజమాన్యానికి చెప్పడంతో వెంటనే రాధికను పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. రాధికను వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. రాధిక మృతితో భర్త అరుణ్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఎగ్జామ్ రాసేందుకు వచ్చిన తన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగ్జామ్ హాల్ కు తొందరగా వెళ్లాలనే టెన్షన్ తోనే ఇలా జరిగిందని వాపోయాడు. తన భార్యను కోల్పోయానని వాపోయాడు.
Sourav Ganguly: బెంగాల్‌లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న సౌరవ్ గంగూలీ