Leading News Portal in Telugu

Whistles Irritate: ఈలలు బంజేయాలి అంటూ కేసీఆర్ హెచ్చరిక


తెలంగాణలో చరిత్రలో మరో అపురూప ఘట్టాన్ని సీఎం కేసీఆర్ నాంది పలికారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనంత‌రం కొల్లాపూర్‌లో నిర్వహించిన బ‌హిరంగ స‌భ‌లో గులాబీ బాస్ ప్రసంగించారు. కేసీఆర్ మాట్లాడుతుండగా.. కొందరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు విజిల్స్ వేయడంతో ఆయనకు చిరాకు వచ్చింది. దీంతో ఇలలు బంజేయాలి అంటూ హెచ్చరించారు. పదే పదే ఇలలు వేస్తుండటంతో విసుగు చెందిన కేసీఆర్.. విజిల్స్ వేసిన వారు మన పార్టీకి చెందిన వాళ్లు కాదు అంటూ తెలిపారు. అయినా కూడా కార్యకర్తలు వినకపోవడంతో తన స్పీచ్ ను అలాగే కొనసాగించాడు. మధ్య మధ్యలో విజిల్స్ వేసే వారిపై సెటైర్లు వేస్తూ.. ప్రసంగం ముగించారు.

బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఒక‌ప్పుడు పాల‌మూరు బిడ్డ హైద‌రాబాద్‌లో అడ్డా కూలీగా ఉండేవాడని.. కానీ ప్రస్తుతం పాల‌మూరుకు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వ‌చ్చి పని చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. పాల‌మూరు బిడ్డల మారిన ముఖ‌చిత్రానికి ఇది నిదర్శనమని సీఎం అన్నారు. ఈ క్రమంలో.. గత పాలకులపై సీఎం కేసీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 1954లో ఆర్డీఎస్ క‌ట్టారని.. దాన్ని కూడా ఆనాటి ఆంధ్రా పాల‌కులే నాశ‌నం చేశార‌ని ఆయన విమర్శించారు. కేసీఆర్ ఒత్తిడికి త‌లొగ్గి ఆర్డీఎస్ తూములు మూసేస్తే.. మ‌ళ్లీ బాంబులు పెట్టి ఆర్డీఎస్ బ‌ద్దలు కొడుతామ‌ని ఆంధ్రాపాలకులు హెచ్చరించాడు. ఆ మాటలు విని.. సుంకేశుల బ్యారేజీ దగ్గర ఉన్న తనకు ర‌క్తం మ‌రిగిందని.. ఆ మాట అన్న బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డిని బెదిరించినట్టు కేసీఆర్ గుర్తు చేశారు.