Leading News Portal in Telugu

Balapur Ganesh : విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం నమూనాలో బాలాపూర్‌ గణేష్ మండపం


విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం నమూనాలో గణేష్ మండప నిర్మాణం చేపడుతున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయ ఆకృతిలో భారీ బాలాపూర్ గణేష్ మండపాన్ని నిర్మిస్తున్నారు. కలకత్తాకు చెందిన 40 మంది కళాకారుల బృందం మంగళవారం గణేష్ మండప పనులను ప్రారంభించారు. సెప్టెంబర్ ఈరోజు సాయంత్రం లోపు విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయ ఆకృతిలో బాలాపూర్ గణేష్ మండప నిర్మాణ పనులు పూర్తి చేయనున్నారు. విజయవాడ కనకదుర్గమ్మను పోలీని విగ్రహంతో పాటు శంఖు, చక్రాలు, ఇతర దేవతా విగ్రహాలను భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే దూల్పేట్ నుంచి 18 ఫీట్ల ఎత్తైన విగ్రహాన్ని కొనుగోలు చేసి తీసుకువచ్చారు. 21 కిలోల లడ్డును ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఖైరతాబాద్‌ మహాగణపతి సందర్శనకు సిద్ధమయ్యారు.నిర్వాహకులు ముందుగానే తెలిపినట్లుగానే మూడు రోజులు ముందుగానే దర్శనం కలిపిస్తు్‌న్నారు. ఈ పర్యాయం శ్రీ దశ మహావిద్యా గణపతిగా ఖైరతాబాద్‌ గణేషుడు 63 అడుగుల ఎత్తుతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దశ మహావిద్యా గణపతికి రంగులు వేయడం పూర్తి అయింది. సోమవారం జరిగే తొలిపూజకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌లను ఆహ్వానించినట్లు ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవాల నిర్వాహకులు వెల్లడించారు. మహాగణపతిని భక్తులు దర్శించుకునేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.