Leading News Portal in Telugu

EPIONE : ఎపియోన్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఇన్జురీస్ అండ్ రీజెనరేటివ్ థెరపీ


ఇటీవల కాలంలో స్పోర్ట్స్ క్రీడలలో పాల్గొని ఆడేటప్పుడు తగిలిన గాయాల కారణంగా ఆటగాళ్లు ఆట ఆడటం ఆపివేసి, ఆటకు దూరం కావడం సాధారణమైపోయింది. సరైన పరీక్షలు చేసి ప్లాస్మా పునరుత్పత్తి విధానంలో చికిత్స అందించడం ద్వారా ఈ గాయాలను అతి తక్కువ సమయంలో నయం చేసి వారు ఆటలకు దూరం కాకుండా నివారించవచ్చు. ఇపియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటి మల్టీడిసిప్లినరీ సెంటర్, ఇక్కడ మోకాలి కీళ్ల నొప్పుల కోసం 20000 మందికి పైగా రోగులకు ప్లాస్మా పునరుత్పత్తి విధానం ద్వారా (PRP) విజయవంతంగా చికిత్స అందించారు. స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్, మానసిక స్థితి మరియు మానసిక ప్రవర్తన నిపుణులకు, కోచ్లకు సరైన శిక్షణ మరియు పునరావాసం వంటి వాటిపై శ్రద్ధ వహించే మల్టీడిసిప్లినరీ విధానంలో అత్యంత అధినాతనమైన యంత్ర పరికరాలు మరియు క్రీడాకారుల కోసం సరైన ప్రోటోకాల్తో అత్యాధునిక సదుపాయాలతో ఈ కేంద్రం ప్రత్యేకత కలిగి ఉంది. ఇపియోనెసెంటర్లో అత్యంత అర్హత కలిగిన స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్లు అందుబాటులో ఉన్నారు, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్, ట్రైనర్లు, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ బృందం ప్లేయర్లను తిరిగి సాధారణ స్థితికి తీసుకొని వచ్చి తిరిగి క్రీడల్లో పాల్గొనే విధంగా అతి తక్కువ కాలంలో ఒక బృందంగా ఏర్పడి చికిత్స అందించడం వీరి ప్రత్యేకత. తద్వారా ఆటగాళ్లు గాయాలనుంచి త్వరితంగా కోలుకోవడమే కాకుండా మానసికంగా ఎంతో దృఢంగా తయారయి క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు.

ఇపియోన్ వ్యవస్థాపకుడు డాక్టర్ సుధీర్ దారా మరియు సహ వ్యవస్థాపకులు డాక్టర్ మినల్ చంద్ర ప్రతి క్రీడాకారుడికి అనుకూలించే ప్రత్యేకమైన విధానం (ప్రోటోకాల్)తో క్రీడా గాయాలకు సత్వర చికిత్స అందించడానికి పూర్తిగా అంకితభావంతో సేవ చేస్తున్నారు. మోకాలి గాయాలు, ACL మరియు నెలవంక వంటి గాయాలు, షోల్డర్ రొటేటర్ కఫ్ గాయాలు, చీలమండ గాయాలు, వెన్నెముక గాయాలు వంటి క్రీడా గాయాలకు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ, రీజెనరేటివ్ థెరపీ సహాయంతో పెద్ద శస్త్రచికిత్సలు చేయకుండా జాగ్రత్త తీసుకొని చికిత్సలు అందించడం వీరి ప్రత్యేకత. స్పోర్ట్స్ మెడిసిన్లో అత్యంత నైపుణ్యం కలిగిన బృందం, డాక్టర్ సుధీర్ దారా, డాక్టర్ మినల్ చంద్ర, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ స్నేహ తివారీ, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ శ్రీలత, స్పోర్ట్స్ ఫిజికాలజిస్ట్ ఉన్నతి మరియు ట్రైనర్ దీపక్ సింగ్ ఈ మస్క్యులో స్కెలెటల్ అసెస్మెంట్ మరియు స్పోర్ట్స్ గాయాల నిర్వహణ బృందంలో ఉన్నారు.