Leading News Portal in Telugu

Vijayashanti: తెలంగాణ ఏర్పాటుపై వాళ్ళు చెప్పేది అబ్దదం


మరి కొన్ని రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వస్తుండటంతో ఇప్పటికే పలు పార్టీల నాయకులు మాటల యుద్దం స్టార్ట్ చేశారు. ప్రత్యర్థి పార్టీలపై, నాయకులపై ఘాటైన విమర్శలు గుప్పిస్తూ.. పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా విజయశాంతి ఓ పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇయ్యలేదు, తెలంగాణ ప్రజలు ఉద్యమాలతో తెచ్చుకున్నారు అని మంత్రి హరీష్ రావు ఇప్పుడు అంటున్నారు అని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమాల ఫలితంగా బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణ ఏర్పాటును సాధ్యం చేసినది నిజం.. అయితే.. బీఆర్ఎస్ చెప్పుకుంటున్నట్లు వారి ముఖ్యమంత్రి కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి తెచ్చింది అబద్దం, హాస్యాస్పదం అని ఆమె అన్నారు. కేసీఆర్ దీక్ష పేరుతో కథ చేసింది 2009లో.. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది 2014లా.. ఇక, 2014ల దొర గారు దీక్షలని చెప్పే దొంగ దీక్షలు ఏమీ చెయ్యలేదు.. ఇగ, వారు చెప్పుకునే 2009 దీక్షా వ్వవహారానికీ తెలంగాణ ఏర్పాటుకు సంబంధం ఏమిటో అందరూ ఒకసారి అర్థం చేసుకుంటే మంచిది అని ఆమె పేర్కొన్నారు.

ఇలాంటి టైంలోనే నిన్న ( ఆదివారం ) తుక్కుగూడలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన గ్యారెంటీ కార్డుపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. సోనియాగాంధీ అంటే తనకెంతో అభిమానమని ఆమెను గౌరవిస్తామంటూ విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒక్కటే అని.. సయామీ ట్విన్స్ అని ఎప్పటి నుంచో తాను చెబుతున్న మాటని నిన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో చెప్పడం నిజమని ఆమె తెలిపారు. అయితే ఇతర రాష్ట్రాలలో ఎంఐఎం, కాంగ్రెస్‌ను ఓడించడానికి ప్రయత్నిస్తుంది అనేది వారి పరిధిలోని అంశమని విజయశాంతి అన్నారు.