Leading News Portal in Telugu

Komatireddy Raj Gopal Reddy: మీరు లేనప్పుడే బిల్లులు ఆమోదించారు.. రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు


చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చింది. దీనిపై ట్విట్టర్ వేదికగా ( ఎక్స్ ) బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్.. తెలంగాణ ప్రకటించినప్పుడు కేసీఆర్ పార్లమెంట్ లో లేడు, మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తున్నప్పుడు కవిత ఎంపీ కాదు, అయినా ఆ ఘనత మీదే అన్నట్లు చెప్పుకోవాలని చూడటం హాస్యాస్పదం.. కవిత ఓడిపోయింది కాబట్టి సరిపోయింది కానీ, లేదంటే తానే తెచ్చినట్టు డప్పు కొట్టుకుని జనం చెవుల్లో పూలు పెట్టేది అంటూ ఆయన రాసుకొచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మహిళల కోసం ఈ బిల్లును తీసుకొచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. దీన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తాము సాధించిన ఘనత లాగే చెప్పుకుంటుంది అని ఆయన వ్యాఖ్యనించారు.

అయితే, ఇంతకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక బీఆర్‌ఎస్‌ కృషి ఉందని ఆమె పేర్కొన్నారు. మహిళా బిల్లుకు బీఆర్‌ఎస్‌ పూర్తి సపోర్ట్ ఇస్తుందని చెప్పుకొచ్చారు. ఈ బిల్లు దేశంలోని ప్రతిఒక్క మహిళ విజయమని కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీలో బిల్లు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని ఆమె తెలిపారు. తొమ్మిది సంవత్సరాల తర్వాత మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశ పెట్టిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.