Leading News Portal in Telugu

Talasani: నిమర్జనం ఏర్పాట్లు మరింత పెంచాం.. ఎవరూ అపోహలు నమ్మొద్దు..


Talasani: నిమర్జనం ఏర్పాట్లు మరింత పెంచామని, ఎవరూ అపోహలు నమ్మొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో నిమర్జన ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు. రేపటి నుంచి గణేష్ నిమార్జనం మొదలు కానుందని తెలిపారు. నిమర్జనం ఏర్పాట్లు అన్ని ప్రభుత్వం పకడ్బందీగా చేసిందని అన్నారు. జీహెచ్ఎంసి పరిధిలో దాదాపు 90వేల వినాయకులు ఉన్నాయని తలిపారు. ఎవరు ఎక్కడ నిమర్జనం చేయాలో అందరికీ సమాచారం అందించామని తెలిపారు. నిమర్జనం ఏర్పాట్లు మరింత పెంచామని అన్నారు. ఉత్సవ సమితి సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఎవరూ అపోహలు నమ్మొద్దని సూచించారు. ప్రశాంతంగా నిమర్జనం జరిగేలా అందరూ సహకరించాలని మంత్రి తలసాని కోరారు.

Read also: Hussain Sagar: సాగర్‌ కు అదనపు అందం.. త్వరలో లేక్ ఫ్రంట్ పార్కు ప్రారంభం

ఈసారి గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఒకే రోజు రానున్నాయి. సెప్టెంబర్ 19న వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండగా, 28న నిమజ్జనం నిర్వహించనున్నారు. అయితే అదే రోజు మిలాద్ ఉన్ నబీ పండుగ కూడా వచ్చింది. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా హైదరాబాద్‌లో ముస్లింలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అదే రోజు నిమజ్జనం జరగడంతో హిందువులు కూడా వినాయక శోభాయాత్రలు నిర్వహిస్తారు. అయితే రెండు మతాల పండుగలు ఒకే రోజున శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పోలీసులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.

Read also: Simran Choudhary: అందాలు ఆరబోస్తున్న సిమ్రాన్ చౌదరి

ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే ఇరు మతాలకు చెందిన 300 మంది నేతలతో శాంతి కమిటీ (పీస్ కమిటీ)ని ఏర్పాటు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్ రావు నేతృత్వంలో పీస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్సవాల నిర్వహణపై శాంతి కమిటీ సభ్యులు చర్చించారు. రెండు పండుగలు ఒకే రోజు కావడంతో మిలాద్ ఉన్ నబీ ర్యాలీని వాయిదా వేసేందుకు శాంతి కమిటీ సభ్యులు అంగీకరించారు. విగ్రహాలను ప్రతిష్టించిన 3వ, 6వ మరియు 9వ రోజులలో ఎప్పుడైనా గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని హిందూ భక్తులు సూచించారు. రెండు పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Hussain Sagar: సాగర్‌ కు అదనపు అందం.. త్వరలో లేక్ ఫ్రంట్ పార్కు ప్రారంభం