Leading News Portal in Telugu

Telangana : తెలంగాణలో మళ్లీ వర్షాలు.. మరో రెండు రోజులు వర్షాలు..


తెలంగాణాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఉన్నట్లుండి వాతావరణం చల్లగా మారింది.. గత రెండు, మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరగ్గా తాజాగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గురువారం తెల్లవారుజామున పలు చోట్ల భారీ వర్షం కురిసింది.. దీంతో తెలంగాణ మొత్తం వాతావరణం చల్లగా మారింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం సమీపంలోని పశ్చిమబంగ, ఒడిశా తీరాల్లో కొనసాగుతుంది..

ఈ మేరకు ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ములుగు, భూపాలపల్లి, భద్రాత్రి కొత్తగూడెం, సిద్ధిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాలకు వాతావారణ శాఖ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఇక తెలంగాణ వచ్చే రెండు రోజులు కూడా ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు..

ఇక రానున్న 4 రోజులు పొగమంచుతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది.. గురువారం నుంచి మరో వారం రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే అక్టోబర్‌ నెలలో 6వ తేదీ నంఉచి 12వ తేదీ వరకు నైరుతి రుతుపవనాలు వీడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ప్రస్తుతం రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.. తెలంగాణాలో మాత్రమే కాదు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..