Leading News Portal in Telugu

Duddilla Sridhar Babu : ఆచరణ యోగ్యమైన మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నాం


తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ఆయా పార్టీలు మేనిఫెస్టోలను రెడీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సైతం మేనిఫెస్టేను సిద్ధం చేస్తోంది. ఈ సందర్భంగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఆచరణ యోగ్యమైన మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నామన్నారు. అన్ని జిల్లాలో పర్యటన చేసి.. సలహాలు తీసుకుంటామని, జిల్లాల వారీగా సమస్యలకు పరిష్కారం చూపిస్తామన్నారు శ్రీధర్ బాబు. జిల్లా, నియోజకవర్గ మేనిఫెస్టో ఉంటుందని, డీఎస్సీలో 13 వేళా పైచిలుకు ఖాళీలు ఉన్నాయన్నారు. కానీ ఐదు వేల ఉద్యోగాలకె నోటిఫికేషన్ ఇచ్చారని ఆయన అన్నారు. డీఎస్సీ వేస్తాం అన్నాం అని ఐదువేల పోస్టుల నోటిఫికేషన్ ని మేము వ్యతిరేకిస్తున్నామన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం లో మెగా డీఎస్సీ వేస్తామని శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కో జిల్లాకు ఒక్కో తేదీ వేతనాలు ఇస్తున్నారని, మేము అధికారంలోకి వస్తే మొదటి తేదీ వేతనాలు అందిస్తామన్నారు.

అంతేకాకుండా.. ‘మేము ఇచ్చిన గ్యారెంటీ లు అమలు చేస్తాం. కేసీఆర్ చేసే అవినీతి లేకుండా చేస్తే అన్ని పథకాలు అమలు చేసే డబ్బు వస్తోంది. ఆర్థిక క్రమ శిక్షణ ఉంటుంది. కర్ణాటక లో పథకాల అమలు తెలుసుకోవడానికి ఎప్పుడొస్తారో చెప్పండి. తీసుకు వెళ్తాము. కర్ణాటకలో వంద శాతం హామీలు అమలు చేస్తున్నాం. కర్ణాటక పోయి మహిళను ఆడగండి. కేటీఆర్..హరీష్ లు వెళ్లి తెలుసుకోండి. కేటీఆర్.. హరీష్ మాతో వస్తే కర్ణాటక లో తిప్పి చూపిస్తాం. అప్పుడైన కండ్లు తెరుచుకుంటారు. కేటీఆర్..హరీష్ ఎప్పుడు వస్తే అప్పుడు కర్ణాటక తీసుకు వెలితం. అరేపల్లి మోహన్ త్వరలో పార్టీలో చేరతారు. ఆలోచించి చేరతా అన్నారు. ఏదో ఓ సందర్భంలో చేరతారు.’ అని శ్రీధర్‌ బాబు అన్నారు.