Leading News Portal in Telugu

Hyderabad: అన్యోన్య దంపతులు.. ఉప్పల్‌లో ఉప్పు బస్తాలు చోరీ చేసిన భార్య భర్తలు


Hyderabad: టీవీల్లో, పేపర్లలో ఎన్నో రకాల దొంగతనాల గురించి విన్నాం చదివాము. అంతేకాదు తాళం వేసి ఉన్న ఇళ్లలో దోచుకునే వారు కొందరైతే చైన్ స్నాచింగ్ లకు పాల్పడే వారు మరికొందరైతే.. ATMలు, బ్యాంకులు దొంగతనం చేసేవాళ్లు ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యం ఏదో ఒక చోట రకరకాల దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. దొంగలు చోరీలకు పాల్పడే చోట విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. అయితే హైదరాబాద్‌లో ఓ విచిత్రమైన చోరీ జరిగింది. ఈ దొంగతనం చూసిన వాళ్లందరికి నవ్వు పక్కా రావాల్సిందే.. ఎందుకంటే వారు దొంగతనం చేసింది బంగారమో, వెండి వస్తువులు కాదండోయ్ ఉప్పును దొంగతనం చేశారు. అయితే ఈ దొంగతనానికి పాల్పడింది భార్య భర్తలు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ ఘటన హైదరాబాద్‌ లోని ఉప్పల్‌ లో చోటుచేసుకుంది.

ఓ అమ్మాయి, అబ్బాయి కలిసి ఓ కిరాణా దుకాణం ముందు ఉప్పు బస్తాలను దొంగిలించారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడు బస్తాల ఉప్పు దొంగలించారు. ఇద్దరు వచ్చి అర్ధరాత్రి తమ స్కూటీపై ఏడు బస్తాల ఉప్పును సైలెంట్ గా పెట్టుకున్నారు. ఎవరూ చూడకుండా అక్కడి నుంచి పరారయ్యారు. పాపం వాల్లకు తెలియని విషయం ఏంటంటే వాళ్లిద్దరూ చేసే దొంగతనం అంతా సీసీ కెమెరాల్లో రికార్డు అవుతున్నట్లు గమనించలేక పోయారు. అయితే వాళ్లిద్దరు ప్లాన్ ప్రకారమే చేస్తున్నట్లు అర్థమవుతుంది. దొంగతనానికి వచ్చిన ఇద్దరూ కూడా మాస్క్ ధరించి ఉప్పు దొంగతనం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆ షాప్ ఓనర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు కథ బయటకు వచ్చింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్కడే ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించడగా.. వారిద్దరూ చేసిన దొంగతనం అంతా వెలుగులోకి వచ్చింది. అయినా ఉప్పు దొంగతనం చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ లో వినాయక చవితి వేడుకలు మొదలైన విషయం తెలిసిందే.. అయితే గణపతి చేతిలో లడ్డూ ఉండటం ఆనవాయితీ కూడా.. హైదరాబాద్‌లోని మియాపూర్‌ పరిధిలోని మదీనగూడలో ఓ వ్యక్తి వినాయకుడి చేతిలోని లడ్డూలను దొంగలించాడు. ఓంకార సేవా సమితి ఆధ్వర్యంలో భారీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గణేశుడి చేతిలో 11 కిలోల లడ్డూలను ఉంచారు. గణపతి బప్పా మోరియా.. అదా లడ్డు చోరియా.. అంటూ నినాదాలు చేసిన ఓ దొంగ.. ఆ లడ్డూ వైపు చూశాడు. ఆదా లడ్డూ ఏమోగానీ.. మొత్తం దోచేశాడు. ఈ చోరీ మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది.
TSRTC : బస్సు ప్రయాణికులుక గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తే 10 శాతం రాయితీ