Leading News Portal in Telugu

Buildings Collapse: హైదరాబాద్ లో 5 సెకన్లలో రెండు భారీ భవనాల కూల్చివేత


హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ మైండ్ స్పేస్‌లో రెండు భారీ భవనాలను కేవలం 5 సెకన్లలో కూల్చివేశారు. అధునాతన సాంకేతిక విధానాలతో రెండు భవనాల కూల్చివేత జరిగింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల సమస్యలు రావడంతో భవనాలు కూల్చివేసినట్లు తెలిపారు. బిల్డింగ్స్ కూల్చివేసిన ప్రాంతాల్లో భారీ భవనాలను అధికారులు నిర్మించనున్నారు. భవనాల కూల్చివేతకు భారీగా పేలుడుపదార్థాలను వినియోగించారు. క్షణాల్లో నేలమట్టమైన రెండు భవనాలు.. భవనాల కూల్చివేత సమయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్త భవనాలు నిర్మిస్తామంటున్న అధికారులు వెల్లడించారు. భవనాల కూల్చివేతను ఎడిపిక్ ఇంజినీరింగ్ సంస్థ పర్యవేక్షించింది.