Leading News Portal in Telugu

Motkupalli Narasimhulu: చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధం..


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్ రాజ్యాంగ విరుద్ధం అని బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఇదే ఎన్టీఆర్ ఘాట్ నుంచి జగన్ గెలవాలని కోరుకున్నా.. నా మాట ప్రకారం దళిత వర్గాలంతా ఏకమై జగన్ ను గెలిపించారు.. గెలిచిన తర్వాత జగన్ కు ఒక మైకం వచ్చింది.. ఆ మైకంలో కన్న తల్లిని బయటకు పంపించాడు అని ఆయన ఆరోపించారు. ఆ తరువాత జగన్ కోసం పాదయాత్ర చేసిన చెల్లి షర్మిలను బయటకు గెంటేశాడు.. జగన్ పరిపాలించే రాష్ట్రానికి రాజధాని లేదు.. రాజధాని లేని రాజ్యానికి నియంత జగన్ అయ్యాడు అంటూ మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఒక అవకాశం ఇస్తే బాగా పాలన చేస్తాడని ప్రజలు నమ్మారు.. కానీ, జగన్ కు పిచ్చి నెత్తికెక్కింది అని మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని చిత్ర హింసలకు గురిచేస్తున్నారు.. మాట్లాడినవాళ్ళందరిపై కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు. 74 ఏళ్ల పెద్దమనిషి చంద్రబాబు.. దేశంలో ఎంతో అనుభవం ఉన్న నాయకుడిని జైల్లో పెడతావా.. చంద్రబాబును జైల్లో పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నాడు జగన్.. ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు లేదు.. గవర్నర్ అనుమతి తీసుకోకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా అరెస్ట్ చేశారు అంటూ మోత్కుపల్లి నర్సింహహులు అన్నారు.

7, 8 లక్షలు కోట్ల బడ్జెట్ ఖర్చు చేసిన చంద్రబాబు ముష్టి 300 కోట్ల రూపాయల కోసం అవినీతికి పాల్పడతాడా అంటూ మోత్కుపల్లి నర్సింహులు అన్నాడు. చంద్రబాబు ఎప్పుడు కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడిన వ్యక్తి కాదు.. చంద్రబాబును చంపుతావా జగన్.. చంద్రబాబు క్రిమినల్ కాదు.. వెంటనే చంద్రబాబు వయస్సుకు విలువ ఇచ్చి జగన్ క్షమాపణ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జగన్ తన తప్పును సరిదిద్దుకోవాలి.. జగన్ ఎవరి బిడ్డ.. దోమలు కుడుతున్నాయని చంద్రబాబు జడ్జికి చెప్పారు.. చంద్రబాబు జైల్లో చనిపోయితే నీవే బాధ్యుడవు.. నీ నాటకాలన్ని ప్రజలకు అర్థం అయ్యాయి.. జగన్ దళిత ద్రోహి అంటూ మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు.

దళితులు జగన్ కు ఓటెయ్యారు.. చంద్రబాబు అరెస్ట్ ప్రజాస్వామ్య నీకె ముప్పు ఉందని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. 2, 3 రోజుల్లో రాజమండ్రి వెళ్ళి భువనేశ్వరిని కలిసి పరామర్శిస్తాను.. అవకాశం ఉంటే జైల్లో చంద్రబాబును కలుస్తాను.. జగన్ ది రౌడీ రాజకీయం.. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రేపు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఒకరోజు నిరసన దీక్ష చేస్తా.. చంద్రబాబు అరెస్ట్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించాలి.. ప్రత్యేకంగా కేసీఆర్ కు విజ్ఞప్తి చేస్తున్నా.. జైల్లో ఉన్న చంద్రబాబ నే ప్రజలు గెలిపిస్తారు అని మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు.