హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే రహదారిలో స్థానికులు ఆందోళన చేస్తున్నారు. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వెళ్లే ప్రధాన రహదారిపై మృతదేహంతో సిద్ధాంతి గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు.
వివరాల్లోకి వెళితే.. సిద్ధాంతి గ్రామానికి చెందిన యాదయ్య అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా ఆక్సిడెంట్ కావడంతో అక్కడిక్కడే చనిపోయాడు.. దీంతో ప్రతిరోజు వాహనాలు వేగంగా రావడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాణాలు పోతున్నాయంటూ గ్రామస్తులు ఈ బ్రిడ్జిని కొనసాగించాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు మాట వినకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడ్డారు. వందల మంది రోడ్డుపై బైఠాయించడంలో రోడ్డు క్లియర్ చేసేందుకు పోలీసుల లాఠీఛార్జ్ చేస్తున్నారు. దీంతో కిలోమీటర్ల దూరం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శంషాబాద్-గగన్‌పహాడ్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. వాహనాలను రోడ్లపై వదిలి ఎయిర్‌పోర్టుకు ప్రయాణికులు పరుగులు పెడుతున్నారు.