Tearful Students: ప్రభుత్వ పాఠశాలల్లో సమయానికి రాని ఉపాధ్యాయులు, సరిగా బోధించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఉపాధ్యాయులు, పాఠశాలలకు రాని ఉపాధ్యాయుల గురించి అందరూ మాట్లాడుకుంటారు. అయితే విద్యార్థులకు ఉన్నత విలువలతో కూడిన బోధన చేయడమే కాకుండా వారిని సొంత బిడ్డల్లా ప్రేమగా చూసుకుంటూ వారికి కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తున్న ఉపాధ్యాయులున్నారు. అందుకే ఇలాంటి ఉపాధ్యాయులను బదిలీ చేస్తే విద్యార్థుల బాధ వర్ణనాతీతం. వెళ్లకండి సార్ అంటూ హెడ్ మాస్టర్ ను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థుల ప్రేమ మాటల్లో చెప్పలేనిది. అలాంటి ఈ ఘటనే సంగారెడ్డి జిల్లాలో జరిగింది.
Read also: Sreeleela : ఆరెంజ్ డ్రెస్ లో కొంటె చూపులతో మతులుపోగొడుతున్న శ్రీలీలా..
సంగారెడ్డి జిల్లాలో ప్రదానోపాధ్యాయుడి బదిలితో విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. కంది మండలం ఎద్దు మైలారం ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ భాస్కర్ వేరే చోటికి ట్రాన్స్ ఫర్ అయ్యారు. హెచ్ఎం భాస్కర్ స్కూల్ విడిచి వెళ్తుండగా వెళ్లొద్దు సర్ అంటూ కన్నీటి పర్యంతమయిన విద్యార్థులు. మీరు వెళ్లొద్దు సర్ ప్లీజ్ సర్ ప్లీజ్ సర్ అంటూ వేడుకున్న విద్యార్థులు. విద్యార్థులను చూసి ప్రదానోపాధ్యాయుడు కన్నీళ్లు అపుకోలేకపోయారు వారితో పాటే ఆయన కూడా ఏడ్చేశారు. మీరు ఏడ్వకండి అంటూ కన్నీటిని తుడుచుకుంటూ స్టూడెంట్స్ లను ఓదార్చారు. అప్పుడప్పుడు మిమ్మల్ని చూడటానికి వస్తాను ఎడవద్దు అంటూ హెడ్మాస్టర్ భాస్కర్ విద్యార్థులను చెప్పారు.
అయినా వినని విద్యార్థులు ప్లీజ్ సార్ మీరు మమ్మల్ని వదిలి వెల్లకండి మీరు ఉంటేనే మేము వస్తాను లేకుంటే స్కూల్ కి రామంటూ మాట్లాడారు. అలా అనకండి మీరందరూ బాగా చదువుకుని భవిష్యత్ లో మంచిగా ఎదగాలని సూచించారు. హెడ్ మాస్టర్, విద్యార్థులు ఏడుస్తుంటే అక్కడే వున్న మిగతా లెక్చరర్లు వచ్చి ఇద్దరిని సముదాయించారు. హెడ్ మాస్టర్ సార్ వస్తారు మిమ్మల్ని చూడటానికి మీరు నిరాశపడకండి అంటూ విద్యార్థలకు ధైర్యం చేప్పారు. ఇక అక్కడి నుంచి హెడ్ మాస్టర్ వెళ్లిపోయారు. హెడ్ మాస్టర్ వెళుతుంటే విద్యార్థులు ఏడుస్తూ ఉండిపోయారు.
Kushi: అక్టోబర్ 1 నుంచి ఓటీటీలోకి వచ్చేస్తుంది…